Site icon NTV Telugu

Kalki 2898AD : విధ్వంసం సృష్టిస్తున్న ప్రభాస్ “కల్కి”.. ప్రీమియర్ షోలకే లక్ష టికెట్స్ సోల్డ్ అవుట్..

Kalki 2898 Ad

Kalki 2898 Ad

Kalki 2898AD : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా.. కల్కి 2898AD. భారతదేశ సినీ పరిశ్రమలలో ఉన్న అగ్రతారాలు అందరూ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రంపై క్రేజ్ మామూలుగా లేదు. జూన్ 27 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లకి రాబోతున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి జూన్ 26న నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలు వేస్తున్నారు. ఇక ఇప్పుడు నార్త్ అమెరికాలో సినిమా టికెట్ల కొరకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. అది ఎంతలా అంటే.. ఇప్పటివరకు ఒక్క ప్రీమియర్ షోలకు మాత్రమే లక్ష టికెట్లు అమ్ముడుపోయాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Aswani Dutt – Chandra Bose : వారందరిని మళ్లీ గుర్తు చేశావయ్యా చంద్రబోస్.. అశ్వినిదత్ ట్వీట్..

ఇది ఒక సెన్సేషన్ రెస్పాన్స్ అంటూ చెప్పవచ్చు. ప్రీమియర్ షోలో మొదలు కావడానికి ముందుగానే ఈ చిత్రం అనేక రికార్డులను కొల్లగొడుతుంది. ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో అంచనా వేయలేకపోతున్నారు సినీ ప్రముఖులు. సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందించగా.. నాగ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని లాంటి వివిధ సినిమా ఇండస్ట్రీల అగ్రతలలతోపాటు.. రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం, శోభన, మాళవిక నాయర్ లాంటి తదితర తారాగణం కూడా సినిమాలో కీలకపాత్రలో నటించారు.

Exit mobile version