పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’..మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ గ్లింప్స్ రిలీజ్ చేసింది.. ఈ గ్లింప్స్ లో శరీరంపై గాయాలతో, చిరిగిన బట్టలు కట్టుకుని అమితాబ్ కనిపించారు. ఒక షాట్‌లో యంగ్ అమితాబ్ నుదుటిపై మణి కనిపిస్తుంది. ‘ద్వాపర యుగం నుంచి దశావతారం కోసం ఎదురు చూస్తున్నాను.. ద్రోణాచార్య తనయుడు అయిన అశ్వత్థామని నేను..’ అని అమితాబ్ చెప్పడంతో ఇంతకీ ఎవరీ అశ్వత్థామ.. శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏంటని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మహా భారతంలో పాండవులు, కౌరవులకు గురువైన ద్రోణుని యొక్క ఏకైక కుమారుడు అశ్వత్థామ.అతని తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి శివుడి ఇచ్చిన వరం కారణముగా అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే, ఆకలి, దప్పుల నుంచి అశ్వత్థామ రక్షణ పొందగలడు.పాండవుడు అయిన అర్జునుడితో సరి సమానంగా ధనుర్విద్యలో అశ్వత్థామ నైపుణ్యం సాధిస్తాడు..కానీ అశ్వత్థామ కౌరవుల పక్షాన నిలుస్తాడు.
కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది.యుద్ధంలో ద్రోణుడిని పాండవులు ఓడించడం అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు. ఆ పధకంలో భాగంగా జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పని ధర్మరాజును పిలిచి అశ్వత్థామ మరణించినట్లుగా అబద్దం చెప్పమని చెబుతాడు.అయితే మొదట్లో ఒప్పుకోని ధర్మరాజు కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు ఒప్పుకుంటాడు.యుద్ధంలో భీకరంగా పోరాడుతున్న ద్రోణుడి ఎదురుగా వచ్చిన ధర్మరాజు ‘అశ్వత్థామ హతః..’ అని గట్టిగా చెప్పి.. ‘కుంజరః’ అని నెమ్మదిగా అంటాడు. తన కుమారుడే మరణించాడనుకుని ద్రోణాచార్యుడు యుద్ధంలో అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు. తండ్రి మరణాన్ని సహించలేక పోయిన అశ్వత్థామ పాండవుల ను ఎలాగైనా అంతం చేయాలని ఉద్దేశంతో వారికీ హాని తలపెట్ట చూస్తాడు..పాండవ వంశాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు .అశ్వత్థామ కుటిల బుద్ధికి కోపోద్రిక్తుడైన శ్రీకృష్ణుడు అతడి తలపై ఉన్న సహజ మణిని తీసి శపిస్తాడు. ‘ఒంటి నుంచి రక్తం కారుతూ దుర్గంధంతో, ఆహారం దొరక్క మండిపోతున్న శరీరంతో ఈ భూమ్మీదే తిరుగు’ అని శపిస్తాడు..ఇలాంటి బలమైన కథ ఆధారంగా ”కల్కి 2898 ఏడీ ”సినిమాను నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు ..
