NTV Telugu Site icon

Kalki 2898 AD: బుజ్జి బుజ్జి బుజ్జి.. అసలు ఎవర్రా ఈ బుజ్జి..?

Kalki 2898 Ad Bujji

Kalki 2898 Ad Bujji

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ “కల్కి 2898 ఏడి”. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తుండగా.. మహానటి సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోనే, అందాల తార దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వైజయంతి మూవీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది. జూన్ 27న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Read Also: Shiromani Akali Dal: “డ్రగ్స్ నేరస్తులకు ఉరిశిక్ష, పంజాబ్ ద్వారా పాకిస్తాన్‌తో వ్యాపారం”.. ఎస్ఏడీ మానిఫెస్టో..

ప్రభాస్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో డార్లింగ్స్‌, ఫైనల్‌ గా ఓ ముఖ్యమైన వ్యక్తి మన లైఫ్‌ లోకి వస్తోంది.. వెయిట్ చేయండి అంటూ పోస్ట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ముఖ్యమైన వ్యక్తి ఎవరా అని ఫ్యాన్స్ అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు ఓ మెషిన్ వుంటుందని సమాచారం. దాని పేరు ”బుజ్జి” అని తెలుస్తుంది. ఆ బుజ్జిని నేడు సాయంత్రం 5 గంటలకు పరిచయం చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ సాయంత్రం ప్రత్యేకంగా ‘బుజ్జి’ అనే వాహనాన్ని విడుదల చేయనున్నారు. ఈ వాహనం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఈ వాహనం డైలాగ్స్ కు ప్రముఖ నటి కీర్తి సురేష్ తన గాత్రాన్ని అందించారు. ఇటీవల కీర్తి సురేష్ ఈ డైలాగ్స్ కు డబ్బింగ్ పూర్తిచేశారు. అంటే ఆమె వాయిస్ మాత్రమే వినపడుతోంది. బహుశా అది టైం మెషిన్ ఏమో., అని అభిమానులు అనుకుంటున్నారు.

Show comments