NTV Telugu Site icon

Kalki 2898 AD : ‘కల్కి’ వాయిదా పై మరోసారి వార్తలు.. వచ్చేది అప్పుడే ?

Kalki

Kalki

టాలీవుడ్ స్టార్ హీరో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గత ఏడాది చివర్లో సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత డార్లింగ్ లైనప్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ పెట్టాడు. ప్రభాస్ కల్కి సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది.. ఈ సినిమా డబ్బింగ్ పనులను మొదలు పెట్టేసినట్లు తెలుస్తుంది..

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్ మూవీ ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.. సమ్మర్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు యూనిట్ రెడీ అవుతుంది.. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా రాబోతుందని, ఫస్ట్ పార్ట్ షూటింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యిందని టాక్. ప్రస్తుతం సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ జరుగుతుందట..

ఇది ఇలా ఉండగా.. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తి చేసుకొని మే 9 న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు.. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో నడిస్తున్నట్లు సమాచారం. ఇక మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్.. హాలీవుడ్ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల పై వాయిదా పడిందనే వార్తలు మరోసారి వినిపిస్తున్నాయి.. సినిమా షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్‌, సీజీ వర్క్ కంప్లీట్‌ కావడం కష్టమని, టీమ్‌ ఆల్టర్‌ నేట్‌ డేట్‌ని ఆలోచిస్తుందని అంటున్నారు. కల్కి 2898 ఏడీ వాయిదా అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.. ఆగష్టు 15 న విడుదల కానుందని సమాచారం.. దీనిపై మేకర్స్ క్లారిటీ రావాల్సి ఉంది.. ఈ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు రాజమౌళి, రానా, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, నాని, మృణాల్ ఠాకూర్ కూడా నటిస్తున్నారు..

Show comments