Site icon NTV Telugu

Kalki 2898 AD : ‘మరియ‌మ్’గా రిఎంట్రీ ఇస్తోన్న శోభ‌న..

Kalki Mariam

Kalki Mariam

Kalki 2898 AD : చాలారోజుల నుండి ఎప్పుడెప్పుడా అంటూ పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతగానో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ వైటెడ్ సినిమా ‘క‌ల్కి 2898 AD’. ప్రపంచవ్యాప్తంగా ఇక కేవలం మ‌రో 8 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు థియేటర్స్ కు రానుంది. ఈ సినిమాతో ఆల్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టించబోతున్నట్లుగా అర్థమవుతుంది. ఇందుకోసం ప్రభాస్ అభిమానులు ముఖ్యంగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబంధం ఇప్పటికే ప్రమోషన్స్ ని ఎంతో పెద్ద ఎత్తున ప్లాన్ చేసి రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంది.

Nalanda University campus: నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలోని మరియ‌మ్ (mariam) పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది చిత్ర బృందం. మరియ‌మ్ అనే పాత్రలో ప్రముఖ నటి శోభన (shobana) నటిస్తున్నట్లుగా తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. సోషల్ మీడియా ఖాతా ద్వారా వైజయంతి మూవీస్ ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు ” ఆమె లాగే తన పూర్వీకులు కూడా ఎదురు చూశారు ” అంటూ క్యాప్షన్ ను జత చేశారు. దింతో ఆమె పాత్రపై అభిమానులలో మరింత ఆసక్తి పెరిగింది.

Assam Floods: వరదలతో అస్సాం విలవిల.. 30 మందికి పైగా మృతి

ఇక కల్కి సినిమాలో ప్రభాస్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో ప్రభాస్ హాలీవుడ్ రేంజ్ లో స్టెంట్స్ చేసాడు.. కాగా ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు సినిమాలో ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని దత్ ప్రొడ్యూస్ తెరకెక్కించారు.

Exit mobile version