Site icon NTV Telugu

Kalki2898AD : కల్కి 2 షూటింగ్ స్టార్ట్.. ప్రభాస్ కోసం వెయిటింగ్!

Kalki

Kalki

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో.. ఈ సినిమా సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు సినీ ప్రియులు. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఫస్ట్ షెడ్యూల్‌లో ఇద్దరు దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాల్గొంటున్నారు. కల్కి మొదటి భాగంలో అమితాబ్ బచ్చన్ ‘అశ్వత్థామ’గా తన విశ్వరూపాన్ని చూపించగా, కమల్ హాసన్ ‘సుప్రీమ్ యాస్కిన్’గా సరికొత్త కనిపించారు. ఈ రెండు పాత్రలు ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచాయి.

Also Read : Varanasi : మహేశ్ – రాజమౌళి ఫైట్‌.. రేయ్ దారుణం రా ఇది?

ఇప్పుడు వీరిద్దరూ సెట్స్‌లో సందడి చేసిన ఫోటోలు బయటికి వచ్చాయి. కమల్ హాసన్‌ను మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉంది.. అని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్‌లో రాస్తూ.. షూటింగ్ సెట్ నుండి కొన్ని ఫోటోలను పంచుకున్నారు. దీంతో.. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అశ్వత్థామ, యాస్కిన్ మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఈ సీక్వెల్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. ఇక ఈ సీక్వెల్‌లో ప్రభాస్ ఎప్పుడు షూటింగ్‌లో పాల్గొంటారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కేవలం అమితాబ్, కమల్ హాసన్‌ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టుల పని ముగించుకుని, తదుపరి షెడ్యూల్‌లో కల్కి 2 సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సీక్వెల్, మొదటి భాగం కంటే రెట్టింపు విజువల్ ఎఫెక్ట్స్ , యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఉండబోతోంది. మరి కల్కి 2 ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version