NTV Telugu Site icon

Kaleshwaram Commission: అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం..

Kaleshwaram Commission

Kaleshwaram Commission

కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది. నేడు అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్‌ను సంస్థ విచారించింది. అన్నారం బ్యారేజి నిర్మాణ సంస్థ అఫ్కాన్స్ పై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.. నిర్మాణానికి ముందు కనీస నిబంధనలు పాటించలేదని కమిషన్ పేర్కొంది. నిర్మాణ సంస్థలు, నిర్మాణంలో నిబంధనలు పాటించి ఉంటే ఇంత డ్యానేజ్ జరిగి ఉండేది కాదని తెలిపింది. ఏజెన్సీల ఫోకస్ నిధుల మీదనే ఉందని స్పష్టం చేసింది. కమిషన్ ముందు కూడా నిధుల ప్రస్తావానే తెస్తున్నాయంది. అన్నారం బ్యారేజి నిర్మించిన ఆఫ్కాన్స్ సంస్థ ప్రతినిధులపై ప్రశ్నల వర్షం కురిపించింది. టెండర్లు వేసే ముందు కనీస జాగ్రత్తలు తీసుకోవాలి కదా? అని కమిషన్ ప్రశ్నించింది.

READ MORE: Gallantry Service Medals: 942 మంది సైనికులకు గ్యాలంట్రీ అవార్డులు..

ఈపీసీ కాంట్రాక్టు అయితే సర్వేలు చేస్తారు. ఐటమ్ రేట్ కాంట్రాక్టు కాబట్టి నేరుగా ఎలాంటి సర్వేలు చేయలేదని సంస్థ సమాధానమిచ్చింది. ప్రాజెక్టు నాణ్యత ఎన్ని రోజులు ఉంటుందని కమిషన్ ప్రశ్నించింది. వందేళ్ల వరకు ఉండేలా నిర్మించినట్లు సంస్థ పేర్కొంది. నిబంధనలు పాటించి ఉంటే వందేళ్ల ప్రాజెక్టు ఏడాది కే డ్యామేజ్ అయ్యేది కాదని కమిషన్ మండిపడింది. అన్నారం బ్యారేజి నిర్మాణం ఆలస్యం కావడానికి కారణం ఏంటి? అని ప్రశ్నించింది. లొకేషన్ మార్పు కారణంగా బ్యారేజి నిర్మాణం ఆలస్యం అయ్యిందని సంస్థ స్పష్టం చేసింది. 2017, 2018 వరదల్లో ఎలాంటి ఇబ్బంది జరగలేదని.. 2019 నవంబర్ వరదల్లో సమస్యలు గుర్తించామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.