Site icon NTV Telugu

Kaleru Venkatesh : అంబర్‌పేటలో బీజేపీ పతనానికి నాంది పలికారు

Kaleru Venkatesh

Kaleru Venkatesh

ఎన్నో అభియోగాలు మోపబడి మూడున్నర సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి అంబర్ పేట బీజేపీ టికెట్ ను కిషన్ రెడ్డి ఎందుకు ఇచ్చారో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి ఆత్మ పరిశీల చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ప్రాసిక్యూషన్ వాళ్లు ఎన్నో అభియోగాలు మోపారు అని అటువంటి వ్యక్తికి కిషన్ రెడ్డి టికెట్ ఇచ్చి అంబర్‌పేటలో బీజేపీ పతనానికి నాంది పలికారని చెప్పారు. రేపు పొద్దున్నే ఆ వ్యక్తితో ఏమి తిరుగుతారో ఒకసారి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ ప్రతినిధులు ఆలోచించుకోవాలని సూచించారు.

Also Read : Delhi High Court: మైనర్‌ను కాజువల్‌గా తాకడం పోక్సో కింద లైంగిక నేరం కాదు: ఢిల్లీ హైకోర్టు

ఈరోజు గోల్నాక డివిజన్ లోని జైస్వాల్ గార్డెన్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల మేనిఫెస్టో వివరించి తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. జైస్వాల్ గార్డెన్లో ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడుతున్నారని, తనను ఆహ్వానించి హారతులు పడుతున్నారని తెలిపారు.కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని అంతా ముక్తకంఠంతో చెప్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి రోజు వందల మంది టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో మాకు పోటి ఎవరున్నారు అన్నది మేము ఆలోచించడం లేదని, మాకు దరిదాపుల్లో ఎవరు లేరని స్పష్టం చేశారు.

Also Read : Delhi: ఢిల్లీలో డీజిల్ వాహనాలకు చెక్.. 24 గంటల్లో 2200 మందికి రూ.20 వేల జరిమానా

Exit mobile version