Kakinada: శాంతిభద్రతలను గాడిలో పెట్టేందుకు పోలీసులు చేస్తున్న కృషి గురించి అందరికి తెలిసిందే. కొందరు రక్షకబటులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తుంటారు. అచ్చం లాంటి ఓ ఘటన తాజాగా కాకినాడలో చోటు చేసుకుంది. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా.. ఓ ఉమెన్ కానిస్టేబుల్ ట్రాఫిక్‌ను క్లియర్ చేసి అందరి మన్ననలు పొందారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్సును ట్రాఫిక్ నుంచి తప్పించారు. స్థానికులు వివరాల ప్రకారం.. నిన్న (శనివారం) సీఎం పర్యటన సందర్భంగా రంగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ ఆముదాల జయశాంతికి కాకినాడలో డ్యూటీ వేశారు. దీంతో ఆమె తన బిడ్డను కాకినాడలో బంధువుల ఇంట్లో ఉంచి డ్యూటీకి వెళ్లారు.
READ MORE: Amazon Great Republic Day Sale 2026: బంపర్ ఆఫర్.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ.22 వేలకు పైగా తగ్గింపు!
ఈ పర్యటన ముగిసిన తరువాత తన స్వగ్రామం వెళ్లడానికి ఆమె బయలుదేరారు. అయితే కాకినాడ – సామర్లకోట రోడ్డులో ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఆమె చూస్తూ ఉండలేకపోయారు. వెంటనే తన బిడ్డను చంకలో ఎత్తుకుని రోడ్డుపై నిలబడి ట్రాఫిక్‌కు క్లియర్ చేశారు. అక్కడున్న ప్రయాణికులు ఆమెను అభినందించారు. కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒకవైపు తల్లి బాధ్యతను, మరోవైపు కానిస్టేబుల్ విధులు నిర్వహించడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. నాడు రణరంగంలో బిడ్డను బుజానికి కట్టుకుని యుద్ధం చేసి రాణిరుద్రమ దేవిలా జయశాంతి కనిపించారు.
READ MORE: Amazon Great Republic Day Sale 2026: బంపర్ ఆఫర్.. గేమింగ్ ల్యాప్‌టాప్‌లపై రూ.22 వేలకు పైగా తగ్గింపు!
