NTV Telugu Site icon

Kakani GovardhanReddy: రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవస్థలో మార్పు

Kakani1

Kakani1

నాలుగో ఏడాది తొలి విడత వైఎస్సార్‌ రైతు భరోసా సాయం అందించే కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రారంభించారు సీఎం జగన్. ఈ సందర్భంగా మంత్రి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా రైతులను సీఎం జగన్ ఆదుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అండగా నిలిచిన సీఎం జగన్ మాత్రమే అన్నారు. RBK ల ద్వారా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చామన్నారు.

రాష్ట్రంలో 10,779 RBK లను ఏర్పాటు చేయడం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. జూన్ 6న మూడువేల ట్రాక్టర్లను రైతులకు సీఎం జగన్ అందించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఇచ్చే పథకాల్లో అవినీతికి పాల్పడ్డారు. రైతులకు చంద్రబాబు చేసిన హాని ఎవ్వరూ మర్చిపోలేదు. చంద్రబాబు హయాంలో కరెంట్ చార్జీలు పెరిగాయని రైతులు ఆందోళన చేస్తే కాల్పులు జరిపించిన విషయం ఎవ్వరూ మరువలేదు. రైతుల పై ప్రేమ చూపుతున్న లోకేష్, పవన్ కళ్యాణ్ లకు పది పంటలు చూపితే ఐదు పంటల పేర్లు చెప్పలేరు.. సీఎం జగన్ ను విమర్శించే హక్కు ఎవరికీ లేదన్నారు.
CM Jagan: రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది