NTV Telugu Site icon

Kajala Agarwal: సినిమాలకు గుడ్ బై.. అదే రీజనా?

Kajal Agarwal

Kajal Agarwal

కాజల్ అగర్వాల్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఒక్క సినిమాతోనే అందరి మనసును గెలుచుకుంది.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది..ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసింది. మొదట్లో మంచి హిట్ సినిమాల ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత గత కొంతకాలం గా సరైన హిట్ సినిమా లేకపోవడంతో తన  ఫ్రెండ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఇక వెంటనే ఒక బిడ్డకు తల్లయింది.. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తుంది.. అందుకోసం లేటెస్ట్ ఫోటోస్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ రచ్చ చేస్తుంది.. రోజురోజుకు నెట్టింట గ్లామర్ మెరుపులు కురిపిస్తుంది.. వాటికి ఓ రేంజ్ లో కామెంట్స్ కూడా వస్తున్నాయి..
Read Also:Varuntej and Lavanya Tripathi: వరుణ్-లావణ్యల పెళ్లి ఇటలీలోనా?

ఇది ఇలా ఉండగా.. తాజాగా ఇప్పుడు మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ఓ వార్త షికారు చేస్తుంది.. అందుకు కారణం కూడా ఉందట.. ఇప్పటి వరకు తను కమిట్ అయిన లను కంప్లీట్‌ చేసి.. సినిమాలకు మరో బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. తన బాబు ఎదుగుతున్న వేళ.. ఆ చిన్నారి ఆలనా పాలనా దగ్గరుండి మరీ చూసుకోవాలని, తల్లిగా తన బాధ్యతలు పర్ఫెక్ట్ గా నిర్వహించాలని కాజల్ అనుకుంటున్నారట. తన భర్త కిచ్లూ కూడా ఇదే చెబుతున్నారట..
Read Also:Train Derail: బెంగాల్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన మేదినీపూర్-హౌరా ప్యాసింజర్

ఇక కాజల్ తొందర్లో ఈ విషయాన్ని అఫీషియల్ గా చెప్పనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఇదే టాక్ వినిపిస్తుంది.. అయితే ఇందులో నిజం ఎంతో తెలియాలంటే.. కాజల్ క్లారిటీ ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.. ఇక ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కమల్ హాసన్ భారతీయుడు సినిమాలో నటిస్తుంది.. అలాగే బాలయ్య భగవంత్‌ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది.. ఆ రెండు సినిమాలు పూర్తయ్యాక సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఇందులో నిజమేంత ఉందో తెలియాల్సి ఉంది..

Show comments