Site icon NTV Telugu

Satyabhama : కాజల్ “సత్య భామ” థర్డ్ సింగిల్ అప్డేట్ వైరల్..

Whatsapp Image 2024 05 11 At 2.02.44 Pm

Whatsapp Image 2024 05 11 At 2.02.44 Pm

Satyabhama: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే కెరీర్ పీక్స్ టైం లోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును ప్రేమించి పెళ్లి చేసుకుంది.పెళ్లి తరువాత రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కాజల్ గత ఏడాది నందమూరి నట సింహం బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా నటించి భారీ హిట్ అందుకుంది.ఇదిలా ఉంటే ఈ భామ వరుసగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తుంది. కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “సత్యభామ” .

Read Also : Samyuktha Menon : ఆ విషయంలో మలయాళీ సినిమానే సౌకర్యంగా ఉంటుంది..

ఈ సినిమాలో కాజల్ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తుంది.ఈ సినిమాలో నవీన్‌ చంద్ర హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్నాడు..ఈ చిత్రాన్ని వురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ గ్లింప్స్‌తో పాటు మొదటి రెండు పాటలను కూడా విడుదల చేయగా అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా మేకర్స్ థర్డ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారుఈ మూవీ నుంచి వెతుకు వెతుకు అనే థర్డ్ సింగిల్‌ను మే 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ చరణ్‌ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.

Exit mobile version