NTV Telugu Site icon

Kajal Karthika OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న కాజల్ హారర్ మూవీ..

Kajall

Kajall

కాజల్ అగర్వాల్ సరికొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. కాజల్ తెలుగులో నటించిన హారర్ మూవీ కాజల్ కార్తీక మూవీ ఏడాది క్రితం థియేటర్లలో విడుదల అయ్యింది. సరిగ్గా ఏడాది తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి విడుదల కానుంది…ఈ మూవీ ఏప్రిల్ 9 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. ఈ సినిమాను ఐదు కథలతో సరికొత్తగా తెరకెక్కించారు..

ఇకపోతే ఈ సినిమాలో రెజీనా, రైజా విల్సన్‌, జనని అయ్యర్, యోగిబాబులు కీలక పాత్రల్లో నటించారు.. డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తమిళ్లో కరుంగాపియమ్ పేరుతో విడుదల అయ్యింది.. అదికాస్త తెలుగు కాజల్ కార్తీక పేరుతో వచ్చింది.. హారర్ ఎలివెంట్స్ జనాలను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.. జనాలకు కథ పెద్దగా నచ్చలేదు దాంతో ఈ సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది.. దాంతో ఎక్కువ రోజులు సినిమా ఆడలేదు..

కథలో హారర్ డోసు తగ్గడం, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. ఏడాది క్రితం విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.. గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్తగా ఉంటుంది.. ప్రస్తుతం కాజల్ సత్యభామ సినిమా చేస్తోంది కాజల్ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ పోలీసుగా కనిపిస్తుంది.. అఖిల్ దర్శకత్వం వహిస్తున్నాడు.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..