NTV Telugu Site icon

Kajal Aggarwal Shocking Decision : సినిమాల కోసం కాజల్ షాకింగ్ డెసిషన్

Kajalararval

Kajalararval

Kajal Aggarwal Shocking Decision : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు తెలుగులో స్టార్ హీరోల అందరితో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది కాజల్. అయినా సినిమాలను చేస్తూ వస్తోంది. ఇటీవల ఈ భామ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆలనపాలనలో కెరీర్ కాస్త స్లో అయింది. కాజల్ చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ ఇటీవలే షూటింగులకు హాజరవుతోంది. ఎప్పటిలాగానే బిజీగా మారడానికి ప్రయత్నిస్తోంది. ఈమె బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ డైట్ మెయింటైన్ చేయడానికి మునుపటిలా అందంగా కనిపించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ -2 సినిమాలో కూడా నటిస్తోంది మరొకవైపు బిడ్డతో తమ సమయాన్ని గడుపుతూనే సినిమాల షూటింగ్లో చాలా బిజీగా ఉంటుంది కాజల్ అగర్వాల్. అలాగే మరొక సరికొత్త సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నది.

Read Also: Black Hole : అతిపెద్ద బ్లాక్ హోల్‎ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. భూమికి ముప్పు అన్న అనుమానాలు

కాజల్ షూటింగ్‎లతో బిజీగా ఉండడంతో తన బిడ్డ సరిగా చూసుకోలేకపోతోంది. ఈమె షూటింగ్ కోసం చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. ఇబ్బందిగా ఉండడంతో ఇండియన్ -2 సినిమా పూర్తి అయ్యేవరకు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తన కుమారుడి బాధ్యతను తన చెల్లికి నిషా అగర్వాల్ కి అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషా అగర్వాల్ ప్రస్తుతం తన అక్క కొడుకును చూసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే కాజల్ తల్లి కూడా వీరితో పాటు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ తమిళంలో ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే కొత్త సినిమా విడుదలకు రెడీగా ఉందని సమాచారం.

Show comments