Site icon NTV Telugu

Kajal Aggarwal : కన్ఫ్యూషన్ లో పడ్డ కాజల్ కెరీర్..

Kajal

Kajal

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అందం అభినయంతో కాజల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.కాజల్ అగర్వాల్ వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది.కెరీర్ ఫుల్ స్వింగ్ లో వున్న సమయంలోనే కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయిన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న కాజల్ గత ఏడాది బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది.ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో కాజల్ కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

Read Also :Sundeep kishan : రవితేజ దర్శకుడితో సందీప్ కిషన్ మూవీ.. షూటింగ్ మొదలు..

కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ పాత్రలు కాకుండా పెర్ఫార్మన్స్ రోల్స్ చేయాలనీ చూస్తుంది.అందులో భాగంగా రీసెంట్ గా ఈ భామ సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.ఈ సినిమాలో కాజల్ యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టింది.ప్రస్తుతం కాజల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న “ఇండియన్ 3 ” సినిమాలో అలాగే మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న “కన్నప్ప” మూవీ చేస్తుంది.ఈ రెండు పెద్ద సినిమాలే అయిన వీటిలో కాజల్ ది కేవలం అతిధి పాత్ర అనే తెలుస్తుంది.దీనితో కాజల్ ప్రస్తుతం కన్ఫ్యూషన్ లో పడింది. బిగ్ ఆఫర్స్ కోసం కాజల్ ఎంతగానో ప్రయత్నిస్తుందని తెలుస్తుంది.మరి కాజల్ తరువాత ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి.

Exit mobile version