Site icon NTV Telugu

Kagiso Rabada: జట్టుకోసం రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధం.. దక్షిణాఫ్రికా బౌలర్ భావోద్వేగం..!

Kagiso Rabada

Kagiso Rabada

Kagiso Rabada: ఇంగ్లాండ్‌ లోని లార్డ్స్ మైదానంలో ఆసీస్‌పై జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లో దక్షిణాఫ్రికా విజయం సాధించిన తర్వాత స్టార్ పేసర్ కగిసో రబాడా మొదటిసారి స్పందించారు. మ్యాచ్‌ లో 9 వికెట్లు తీసిన రబాడా.. తనను తాను ‘స్టార్’గా కాకుండా.. జట్టుకోసం తన రక్తాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటానని అన్నారు.

Read Also: Jasprit Bumrah: ఎట్టకేలకు టెస్టు కెప్టెన్‌ ఎంపికపై మౌనం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే..?

డబ్ల్యూటీసీ ఫైనల్‌ లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ను 212 పరుగులకే కట్టడి చేసినప్పటికీ, తమ బ్యాటింగ్‌ ను ఆస్ట్రేలియా బౌలర్లు 138 పరుగులకే ఆలౌట్‌ చేశారు. కానీ, మళ్లీ బౌలింగ్‌తో రాణించి ఆస్ట్రేలియాను రెండో ఇన్నింగ్స్‌లో 282 పరుగుల లీడ్‌ కే పరిమితం చేశారు. అనంతరం ఐడెన్ మార్క్‌రమ్ చివరి ఇన్నింగ్స్‌ లో అద్భుతమైన 136 పరుగులతో టీమ్‌ ను గెలుపు దిశగా నడిపారు.

Read Also: Karnataka: కొడుకు అల్లరి భరించలేక ఇనుప కడ్డీతో వాతలు పెట్టిన తల్లి.. పోలీసులు ఏం చేశారంటే..?

ఇక తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో రబాడా మాట్లాడుతూ.. నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా చూడను. నేను ఈ జట్టు కోసం నా రక్తాన్నివ్వడానికి సిద్ధంగా ఉన్న ఆటగాడిని. ఎప్పుడూ శ్రమిస్తూ, అభివృద్ధి చెందాలనే తపనతో ఉన్నాను. నాకు జెర్సీపై గౌరవం ఉందని అన్నారు. ఇలాంటి మ్యాచ్ పరిస్థితులలో ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్లు తీయగలగడం కీలకం. ఆటలో ముందున్నా, వెనుక ఉన్నా, నిదానంగా ఆలోచించి ముందు ఉన్న పరిస్థితిని బట్టి ఆడాలి. అదే నా ధోరణి అని రబాడా తెలిపాడు. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన కగిసో రబాడా మొత్తం మ్యాచ్‌లో 9 వికెట్లు తీసి 110 పరుగులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం అతను దక్షిణాఫ్రికా టెస్టు చరిత్రలో నాలుగో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు.

Exit mobile version