Site icon NTV Telugu

AP Elections 2024: పోలింగ్‌కు కడపలో సర్వం సిద్ధం..

Ap Elections 2024

Ap Elections 2024

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లలో మునిగిపోయారు అధికారులు.. ఇక, ఎన్నికల నిర్వహణకు కడప జిల్లా సిద్ధం అయ్యింది. ఉదయం 6:30 గంటల నుంచే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుంటున్నారు ఉద్యోగులు.. ఏ ఏ పోలింగ్ కేంద్రానికి ఎవరిని కేటాయించాలి అన్న ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసిన అధికారులు.. ఆయా కేంద్రాలకు వెళ్లాల్సిన ఉద్యోగులకు ఆదేశాలు ఇస్తున్నారు.. నియంత్రణ యూనిట్లు (CUలు): 4,712 కాగా.. రిజర్వ్ 99, అసెంబ్లీ పరిధిలో 48 పార్లమెంటు పరిధిలో 51 యొక్క అదనపు కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు.. బ్యాలెట్ యూనిట్లు (BUలు): 4,712 కాగా.. రిజర్వులు 319 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేశారు.. అసెంబ్లీ పరిధిలో 277, పార్లమెంటు పరిధిలో 278 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేసి ఉంచారు.

Read Also: Char Dham Yatra: మొదటిరోజు భారీ సంఖ్యలో యాత్రికులు.. ఇద్దరు మృతి..

ఇక, జిల్లా వ్యాప్తంగా వీవీ ఫ్యాట్స్ 5,158 సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.. రిజర్వులో 555 వీవీ ఫ్యాట్స్ ఉంచారు.. అసెంబ్లీ పరిధిలో 277, పార్లమెంటు పరిధిలో 278 వీవీ ఫ్యాట్స్ సిద్ధంగా ఉన్నాయి.. మరోవైపు.. కడప జిల్లా వ్యాప్తంగా 337 మందిని మైక్రో అబ్జర్వర్లుగా నియమించారు.. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్థానాలతో సహా పోలింగ్ స్టేషన్లలో 610 మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎంవోలుగా నియమించారు.. సెక్టార్ ఆఫీసర్లు 214 మందిని అన్ని సెక్టార్లలో ఏసీతో నియమించారు. జిల్లావ్యాప్తంగా 2334 మంది ప్రిసైడింగ్ అధికారులు (PO).. జిల్లా వ్యాప్తంగా 2336 అసిస్ట్ ప్రిసైడింగ్ ఆఫీసరర్స్ (APO).. ఇతర పోలింగ్ అధికారులు 9,768 మంది ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.. మొత్తంగా రేపటి పోలీంగ్‌కు కడప జిల్లా సిద్ధమైంది.

Exit mobile version