Site icon NTV Telugu

Chennai: ఎఐడిఎంకే ఎమ్మెల్యే కదంబూర్ రాజు సంచలన వ్యాఖ్యలు.. విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తారంటూ

Vijay

Vijay

అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కదంబూర్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో రాజకీయ నాయకుడు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరవచ్చని బాంబ్ పేల్చారు. విజయ్ ఎన్డీఏ కూటమీలో వస్తారేమో అంటూ తెలిపారు. జనవరి తర్వాత పొత్తులపై స్పష్టత వస్తుందని అన్నారు. డిఎంకేను ఓడించడమే ఏఐఏడీఎంకే, విజయ్ ల లక్ష్యమని అన్నారు. ఇదే ఆలోచనతో విజయ్ సైతం ఉన్నారు.

Also Read:Atti Satyanarayana: దిల్ రాజుపై అత్తి సత్యనారాయణ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ యాక్టింగ్ అంటూ..

పార్టీల ఆలోచనలన్నీ ఒకటే అయినప్పుడు విజయ్ కూటమిలో చేరడం పట్ల ఆశ్చర్యపోనవసరం లేదు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, తప్పుడు ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు. వారిని ఇంటికి పంపే లక్ష్యంతో మేము ఎన్నికలలో కలిసి పని చేస్తామని తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎఐఎడిఎంకె, బిజెపి కలిసి ఇ పళనిస్వామి (ఇపిఎస్) నాయకత్వంలో పోటీ చేస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏప్రిల్ 11న ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత రాజు ఈ ప్రకటన చేయడం గమనార్హం.

Exit mobile version