Site icon NTV Telugu

Kacheguda to Raichur: నేటి నుంచి కాచిగూడ-రాయచూర్‌ డెమో.. 29 స్టేషన్లలో ఆగనున్న ట్రైన్

Trina

Trina

Kacheguda to Raichur: కాచిగూడ-రాయచూర్ డెమో రైలు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ రైలు 29 స్టేషన్లలో ఆగుతుంది. వీరిలో ఎక్కువ మంది తెలంగాణ, కర్ణాటక మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల మధ్య దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతోంది. కాచిగూడ-యశ్వంతపుర మధ్య వందే భారత్ రైలు కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రతి గురువారం మినహా మిగిలిన రోజుల్లో ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రెండు నగరాల మధ్య రైలు నడుస్తుండగా, ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉందని అధికారులు తెలిపారు. తాజాగా, కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త అందించింది, కాచిగూడ-రాయచూర్ డెము రైలు నేటి (అక్టోబర్ 2) నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.

ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 9.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు రాయచూరు చేరుకుంటుందని తెలిపారు. ప్రయాణానికి దాదాపు 5.40 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయచూర్‌లో బయలుదేరి రాత్రి 9.10 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. డెము రైలు వాజానగర్, షాద్ నగర్, మహబూబ్ నగర్, దేవరకద్ర, జక్లేరే, మక్తల్, కృష్ణా స్టేషన్ల మీదుగా రాయచూర్ చేరుకుంటుంది. మొత్తం 29 స్టేషన్లలో రైలు ఆగుతుందని వెల్లడించారు. రైల్వే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
CM Jagan: మ‌హాత్మా గాంధీ గారి మార్గంలోనే న‌డుస్తున్నాం..

Exit mobile version