Site icon NTV Telugu

KA Paul Warns Vijay: విజయ్ దేవర కొండకు కేఏపాల్ స్ట్రాంగ్ వార్నింగ్.. 24 గంటలు డెడ్‌లైన్..!

Ka Paul Warns Vijay

Ka Paul Warns Vijay

KA Paul Warns Vijay: ఈడీ విచారణకు బుధవారం హాజరైన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో క్షమాపణ చెప్పి యాప్ ప్రచారం కోసం సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ రోజుల్లో చదువులేని వాళ్లు కూడా బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై డబ్బులు పోగోట్టుకుంటున్నారని అన్నారు. బెట్టింగ్ యాప్‌లో పాల్గొనే వారికి నూటికి 99 శాతం మందికి డబ్బులు రావని, కానీ వాటిని ప్రచారం చేసినందుకు నీకు మాత్రం డబ్బులు వస్తాయని అన్నారు. ఇటీవల సురేష్ యువకుడు బెట్టింగ్ యాప్‌ల ద్వారా తీవ్రంగా నష్టపోయి తన కుటుంబాన్ని వదిలేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ‘బుద్ధి ఉండాలి, నువ్వు చిన్న కుర్రోడివి మంచి కోసం ఫైట్ చేయాలి, కానీ ఇలా ప్రజల ప్రాణాలు తీసే యాప్‌ల కోసం కాదు’ అని అన్నారు. విజయ్ మార్పు చెందితే 24 గంటల్లో క్షమాపణలు చెప్పి, యాప్ ప్రచారం ద్వారా సంపాదించిన డబ్బులు మొత్తాన్ని బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రకటనలు చేసిన ఎవరినీ వదిలిపెట్టని హెచ్చరించారు.

READ MORE: War 2 : ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడంటే?

ఇంతకి బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై విజయ్ ఏమన్నాడు..?

హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసులో తన పేరు రావడంతో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయ్, తాను ప్రమోట్ చేసిన A23 యాప్‌కు సంబంధించి సమగ్ర సమాచారం అందించి, తన వైఖరిని మీడియాకి స్పష్టం చేశారు. విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో బెట్టింగ్ యాప్స్ మరియు గేమింగ్ యాప్స్ మధ్య తేడాను స్పష్టంగా వివరించారు. దేశంలో ఈ రెండు రకాల యాప్స్ వేర్వేరు స్వభావం కలిగి ఉన్నాయని, తాను ప్రమోట్ చేసిన A23 యాప్ ఒక గేమింగ్ యాప్ అని ఆయన తెలిపారు. బెట్టింగ్ యాప్స్‌కు, గేమింగ్ యాప్స్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన నొక్కి చెప్పారు.

గేమింగ్ యాప్స్ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధంగా గుర్తింపు పొందాయని, వీటికి GST, టాక్స్, అనుమతులు, రిజిస్ట్రేషన్‌లు వంటి చట్టపరమైన అవసరాలు ఉంటాయని విజయ్ వెల్లడించారు. ఈ గేమింగ్ యాప్స్ IPL, కబడ్డీ, వాలీబాల్ వంటి క్రీడలకు స్పాన్సర్‌షిప్‌లు అందిస్తున్నాయని, ఇది వాటి చట్టబద్ధతను సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ తాను ప్రమోట్ చేసిన A23 యాప్ తెలంగాణలో ఓపెన్ కాదని, ఇది కేవలం చట్టబద్ధంగా అనుమతించబడిన రాష్ట్రాల్లోనే పనిచేస్తుందని స్పష్టం చేశారు. A23 ఒక స్కిల్-బేస్డ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌గా, రమ్మీ వంటి గేమ్‌లను అందిస్తుందని, ఇది సుప్రీంకోర్టు గుర్తింపు పొందిన స్కిల్ ఆధారిత గేమ్‌గా ఉందని ఆయన తెలిపారు. విచారణ సందర్భంగా విజయ్ దేవరకొండ తన బ్యాంక్ లావాదేవీల వివరాలను, A23 యాప్‌తో చేసుకున్న కాంట్రాక్ట్ వివరాలను, లీగల్‌గా తీసుకున్న అమౌంట్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈడీకి సమర్పించారు. తాను కేవలం చట్టబద్ధమైన గేమింగ్ యాప్స్‌ను మాత్రమే ప్రమోట్ చేశానని, అన్ని లావాదేవీలు పారదర్శకంగా ఉన్నాయని ఆయన చెప్పారు.

READ MORE: Yash Dayal: అత్యాచారం కేసులో ఆర్‌సీబీ ప్లేయర్‌కు భారీ ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా..?

Exit mobile version