NTV Telugu Site icon

KA Paul: గుర్తుపట్టలేని స్థితిలో పాల్.. అసలేమైంది?

Collage Maker 28 Oct 2022 08.27 Pm

Collage Maker 28 Oct 2022 08.27 Pm

కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ అధినేతగా, వెరైటీ ఆలోచనలతో, చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరినీ అలరిస్తుంటారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాయుద్థ నౌక గద్దర్‌ కి సీటిచ్చినా.. ఆయన నామినేషన్ వేసే పరిస్థితి లేకపోవడంతో తానే స్వయంగా మునుగోడు గోదాలోకి దిగారు. బరిలో ఉన్ననాటినుంచీ ఆయన ఎన్నికల ప్రచారం చిత్ర విచిత్రంగా సాగుతూనే వుంది. తాజాగా ఆయన చేసిన ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. విచిత్ర వేషధారణతో గుర్తుపట్టలేనంతగా మారిన పాల్ సైకిల్ తొక్కుతూ కనిపించారు.

Read Also:Rahul Gandhi: దేశమంతా రైతు రుణమాఫీ, ఒకటే జీఎస్టీ

ఆయన విన్యాసాలు అందరికీ కామెడీగా అనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని, ప్రజాశాంతి పార్టీ గెలుపు తథ్యమని పాల్ చెబుతుంటే.. లోలోపల నవ్వుకుంటున్నారు ఓటర్లు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తనకు పోటీయే కాదన్నారు. అంతేకాదు తన సహజ ధోరణికి భిన్నంగా బనియన్ వేసుకుని, తలపై తలపాగా, పంచె కట్టి ఒక రైతులా మారి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

తన మాటలు, హావభావాలతో రైతులను నవ్వించారు. రైతులతో కలిసి పత్తి ఏరారు. ఇవాళ కేఏ పాల్ ప్రచారం చండూరు పరిధిలో సాగింది. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ స్పెషల్ అట్రాక్షన్. అంతేకాదు ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆయన మండిపడ్డారు. వందల కోట్లు పెట్టి పశువుల్ని, గొర్రెల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనడం ఏంటని పాల్ విమర్శించారు. రెండు రోజుల క్రితం నడిరోడ్డుపై మాస్ డ్యాన్స్ వేసి కేఏ పాల్ అందరినీ అలరించాడు. మొన్నామధ్య ఓ సెలూన్ లో కటింగ్ వేయించుకుంటూ ప్రచారం చేశారు. ఆయన ప్రచారంలో వేషాలేస్తూ అలరిస్తున్నారు. కేఏ పాల్ పై రాసిన పాటకు తనే డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. మునుగోడులో తనదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Human Washing Machine: బట్టలనే కాదు.. ఈ వాషింగ్ మెషిన్ మనుషులను కూడా ఉతుకుతుంది..!!

Show comments