KA Paul: గుర్తుపట్టలేని స్థితిలో పాల్.. అసలేమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేఏ పాల్.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ అధినేతగా, వెరైటీ ఆలోచనలతో, చిత్ర విచిత్ర విన్యాసాలతో అందరినీ అలరిస్తుంటారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాయుద్థ నౌక గద్దర్ కి సీటిచ్చినా.. ఆయన నామినేషన్ వేసే పరిస్థితి లేకపోవడంతో తానే స్వయంగా మునుగోడు గోదాలోకి దిగారు. బరిలో ఉన్ననాటినుంచీ ఆయన ఎన్నికల ప్రచారం చిత్ర విచిత్రంగా సాగుతూనే వుంది. తాజాగా ఆయన చేసిన ఎన్నికల ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది. విచిత్ర వేషధారణతో గుర్తుపట్టలేనంతగా మారిన పాల్ సైకిల్ తొక్కుతూ కనిపించారు.
Read Also:Rahul Gandhi: దేశమంతా రైతు రుణమాఫీ, ఒకటే జీఎస్టీ
Also Read
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- 2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
- Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
ఆయన విన్యాసాలు అందరికీ కామెడీగా అనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని, ప్రజాశాంతి పార్టీ గెలుపు తథ్యమని పాల్ చెబుతుంటే.. లోలోపల నవ్వుకుంటున్నారు ఓటర్లు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తనకు పోటీయే కాదన్నారు. అంతేకాదు తన సహజ ధోరణికి భిన్నంగా బనియన్ వేసుకుని, తలపై తలపాగా, పంచె కట్టి ఒక రైతులా మారి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తన మాటలు, హావభావాలతో రైతులను నవ్వించారు. రైతులతో కలిసి పత్తి ఏరారు. ఇవాళ కేఏ పాల్ ప్రచారం చండూరు పరిధిలో సాగింది. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్ స్పెషల్ అట్రాక్షన్. అంతేకాదు ఎమ్మెల్యేల కొనుగోలుపై ఆయన మండిపడ్డారు. వందల కోట్లు పెట్టి పశువుల్ని, గొర్రెల్ని కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనడం ఏంటని పాల్ విమర్శించారు. రెండు రోజుల క్రితం నడిరోడ్డుపై మాస్ డ్యాన్స్ వేసి కేఏ పాల్ అందరినీ అలరించాడు. మొన్నామధ్య ఓ సెలూన్ లో కటింగ్ వేయించుకుంటూ ప్రచారం చేశారు. ఆయన ప్రచారంలో వేషాలేస్తూ అలరిస్తున్నారు. కేఏ పాల్ పై రాసిన పాటకు తనే డ్యాన్స్ చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపారు. మునుగోడులో తనదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Human Washing Machine: బట్టలనే కాదు.. ఈ వాషింగ్ మెషిన్ మనుషులను కూడా ఉతుకుతుంది..!!
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!