Site icon NTV Telugu

KA Paul: 60 శాతం నా వైపే.. వార్‌ వన్‌సైడే..

Ka Paul

Ka Paul

KA Paul Promises To Develop Munugode As America: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కూడా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే! స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా మునుగోడు పరిధిలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన.. స్థానికులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసి… స్వీట్లు పంపిణీ చేశారు. చాయ్​ పెట్టి ప్రజలకు టీ తాగించారు. అంతేనా సెలూన్ షాప్‌కు వెళ్లి కటింగ్ చేయించుకున్నారు. ఇప్పటికే మునుగోడులో కేఏ పాల్‌ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు మునుగోడులో పోటీ చేస్తున్న విషయం విదితమే. అయితే తన పార్టీ తరఫున వేసిన నామినేషన్ చెల్లదని ఈసీ ప్రకటించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన పాల్… ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు.

Target Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి టార్గెట్.. కాంగ్రెస్ పక్కా ప్లాన్

ప్రచారం నిర్వహిస్తోన్న పాల్‌ హామీల వర్షం కురిపిస్తున్నారు. మునుగోడులో 60 నెలల్లో లేని అభివృద్ధి 6 నెలల్లో చేసి పడేస్తా అని వ్యాఖ్యానించారు. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్‌ఎస్‌ అయినా తనకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. 6నెలల్లో ఒక మండలానికి కాలేజీ, ఉచిత ఆసుపత్రి, ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు ఇచ్చి 6నెలల్లో మునుగోడును అమెరికాను చేసి చూపిస్తానని కేఏ పాల్‌ హామీ ఇచ్చారు. మునుగోడులో ప్రజలు 60శాతం ఆల్​రెడీ డిసైడ్ చేశారన్నారు. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించడానికి ఇంకా కష్టపడితే ఆ మూడు పార్టీలకు డిపాజిట్లు కూడా రావన్నారు. వార్ వన్‌సైడ్‌ అయిపోయిందనే… తెరాస గుండాలు, కాంగ్రెస్ గుండాలు అడ్డుకుంటున్నారని కేఏ పాల్‌ ఆరోపించారు.

Exit mobile version