KA Paul: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది.. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందోన్న ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, ఇప్పుడు ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతుండగా.. ఆ స్పత్రికి వెళ్లి కేఏ పాల్.. శ్రీలక్ష్మిని పరామర్శించారు.. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ వివేకా కేసులో తాజాగా వైఎస్ విమలాదేవి హార్ట్ టచ్ వీడియో చూశానని తెలిపారు పాల్.. నేను టర్కీ వెళ్లాల్సి ఉంది.. కానీ, అవినాష్ రెడ్డి తల్లిని చూడాలని కర్నూలుకు వచ్చానని తెలిపారు.. ఆస్పత్రిలో అవినాష్‌రెడ్డిని కలిసి సందర్భంగా నేను ముక్కు సూటిగా అవినాష్ ని కొన్ని ప్రశ్నలు అడిగానని.. కానీ, వైఎస్ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు వెల్లడించారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
అయితే, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు కేఏ పాల్.. ఎప్పుడు పిలిచినా సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పారన్నారు.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుకున్నారు పాల్.. అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరించరాదని హితవుపలికారు.. ఈ కేసులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి న్యాయం జరగాలని ఆకాక్షించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. కాగా, 16వ తేదీ సీబీఐ విచారణకు గైర్హాజరైన అవినాశ్ రెడ్డి.. 19వ తేదీన తన తల్లికి అనారోగ్యమంటూ మరోసారి విచారణకు రాలేదు. పులివెందులలో అనారోగ్యంపాలైన తన తల్లి శ్రీలక్ష్మిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తారని అంతా భావించారు.. అయితే, కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు అవినాష్‌రెడ్డి.. 22వ తేదీన మళ్లీ విచారణకు రావాలని సీబీఐ కోరింది.. తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు రాలేనని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరిన విషయం విదితమే.