K.A.Paul : కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై కేఏ పాల్ తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై ఈరోజు హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను వ్యతిరేకిస్తూ పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.. పార్టీ ఇన్ పర్సన్‌గా వాదనలు వినిపించనున్నారు. రైతుల అభ్యంతరాలను తీసుకోకుండా మాస్టర్ ప్లాన్‌పై జీవో ఇచ్చారని తన పిల్‌లో కేఏ పాల్ పేర్కొన్నారు.
Read Also: Budget 2023: బడ్జెట్‌కు ఆమోదం తెలపని గవర్నర్.. కోర్టుకు వెళ్లిన ప్రభుత్వం
కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని కోరుతూ పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి జనవరి 25న హైకోర్టులో విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందన్న పిటిషన్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే మాస్టర్ ప్లాన్‌పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది చెప్పారు. ఈ క్రమంలోనే కౌన్సిల్ నిర్ణయంపై ప్రభుత్వ వైఖరి రెండు వారాల్లో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను కౌంటర్ అఫిడవిట్‌లో పొందుపరచాలని తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.