NTV Telugu Site icon

KA Paul Campaign: వారం రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యేను నేనే

KA PAUL 1

3d62d613 B272 4371 94a0 238fbc6b7b69

KA Paul Confidence on Munugode By poll: ప్రజాశాంతి పార్టీ అధినేత, మునుగోడులో పోటీచేస్తున్న కేఏ పాల్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్,బిజెపి,కాంగ్రెస్ పార్టీల మధ్య సీరియస్ గా ఎన్నికల ప్రచారంలో నిర్వహిస్తుంటే.. ప్రజా శాంతి పార్టీ అభ్యర్థి కే ఏ పాల్ ప్రచారం మాత్రం ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో అంకిరెడ్డి పల్లి చౌరస్తా లో ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి వరకూ నేనే సీఎం అన్న పాల్.. ఇప్పుడు స్వరం మార్చారు.. నేను సీఎం కాదు పీఎం అవుతాను అంటున్నారు.

కులగజ్జి లేని సమాజం కావాలని పాల్ పిలుపునిచ్చారు. వారం రోజుల్లో మునుగోడు ఎమ్మెల్యే అవుతాను అని కే ఏ పాల్ అన్నారు. ఆయన ఏ ధీమాతో ఈ మాటలు అంటున్నారో తెలీదు గానీ…. ఈయన కాన్ఫిడెంట్ చూసి మిగిలిన పార్టీల కార్యకర్తలు అవాక్కవుతున్నారు. రెండురోజుల క్రితం కారులో వెళుతూ ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. మునుగోడులో గెలిచేది తానేనని, మునుగోడులో మన తర్వాతే ఎవరైనా అంటున్నారు పాల్.

Read Also: KA Paul: గుర్తుపట్టలేని స్థితిలో పాల్.. అసలేమైంది?

మొదటి స్థానం మనదేనని తర్వాత ఎవరుంటారో తేల్చుకోవాలన్నారు. ఆయన విన్యాసాలు అందరికీ నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని, ప్రజాశాంతి పార్టీ గెలుపు తథ్యమని పాల్ చెబుతుంటే.. లోలోపల నవ్వుకుంటున్నారు ఓటర్లు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు తనకు పోటీయే కాదంటున్నారు. అందరికంటే భిన్నంగా బనియన్ వేసుకుని, తలపై తలపాగా, పంచె కట్టి ఒక రైతులా మారి.. ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈరోజుతో ప్రచారం ముగియనుంది. ఈ నెల 3వ తేదీన ఓటర్లు పాల్ కు ఎన్ని ఓట్లు వేస్తారో చూడాలి. ఈనెల 6వ తేదీన జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో పాల్ ఓట్ల లెక్క తేలిపోనుంది. గెలిచినా.. ఓడినా పాల్ కామెడీ మాత్రం మునుగోడు వాసులకు కలకాలం గుర్తుండిపోతుదంటే అతిశయోక్తి కాదు.

Read Also: Funny Video: సీరియల్‌లో ఈ సీన్ చూస్తే.. మీరు నవ్వు ఆపుకోలేరు..!!