KA Paul: బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదా సహా ఇచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. శ్రీలంక రాజపక్సేతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అయినా కుటుంబ పాలన వద్దని చెప్పానని పాల్ వెల్లడించారు. ఏపీకి అప్పులు భారంగా మారనున్నాయన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో నేతలు ఒకరిని ఒకరు తిట్టుకోవడంతోనే సరిపోతుందన్నారు. తెలుగు రాష్ట్రాలను రక్షించుకోలేక పోతే దేశాన్ని కూడా రక్షించుకోలేమని ఆయన అన్నారు.
Kishan Reddy: వెంకయ్య గ్రామంలో అధికారులపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
ఏపీకి ఏమి చేయని బీజేపీతో జనసేన పొత్తులు పెట్టుకుంటుందని.. వైసీపీ ఏది అడిగితే అది చేస్తుందని ఆరోపించారు. ఏపీలో ఎకనమిక్ సమిట్ పెట్టాలని మోదీని కలుద్దామంటే ఇక్కడి నేతలు కలసి రావటం లేదన్నారు. రాజకీయ నేతలందరూ రాజీనామాలు చేసి నాతో కలిసి వస్తే అన్నీ సాధిస్తామన్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అప్పులు చేసి ఈ సీఎంకు ఇచ్చారని విమర్శించారు. సీఎం జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఆయనకే తెలియదన్నారు. కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమి అడగటం లేదన్నారు. కొడుకుని సీఎంని చేసి తాను పీఎం కావాలని గత ఎన్నికల్లో చంద్రబాబు తిరిగారని కేఏ పాల్ ఆరోపించారు. పీఎం కావాలని కేసీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. చంద్రబాబు, జగన్‌లు ఇద్దరూ తోడు దొంగలేనన్న కేఏ పాల్.. తనను ప్రధానిని చేస్తే దేశ దశ మార్చి చూపిస్తానని స్పష్టం చేశారు.