NTV Telugu Site icon

K C Venugopal: సచిన్ పైలట్ కొత్త పార్టీ పెట్టడం లేదు.. ఒట్టి పుకార్లు మాత్రమే..

Kc Venugopal

Kc Venugopal

రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలట్‌కు ఏమాత్రం పొసగడం లేదు.. ఇద్దరి మధ్య తరచూ విభేదాలు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో సచిన్‌ పైలట్‌ కొత్త పార్టీ పెడుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. తన తండ్రి రాజేశ్‌ పైలట్‌ వర్ధంతి అయిన జూన్‌ 11న సచిన్‌ పైలట్‌ తన పార్టీ పేరును ప్రకటిస్తారనే ప్రచారం జోరుగా జరుగుతున్నది.

Read Also : Sharwanand: హీరో శర్వానంద్, రక్షిక రిసెప్షన్ ఫోటోలు

రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం..పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలట్‌ ఈ నెల 11న కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్‌ పార్టీ కొట్టిపారేసింది. సచిన్‌ పైలట్‌ ఏ పార్టీ పెట్టడంలేదని, అదంతా అసత్య ప్రచారం.. ఒట్టి పుకార్లు మాత్రమేనంటూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ క్లారిటీ ఇచ్చారు. తాను ఈ విషయంపై సచిన్‌ పైలట్‌తో ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చించాను.. అదంతా అబద్ధపు ప్రచారమని ఆయన చెప్పారని కేసీ వేణుగోపాల్‌ వెల్లడించారు.

Read Also : Lavanya-Varun: వీరిద్దరు ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారు?

సచిన్ పైలెట్ సొంతంగా పార్టీ పెట్టుకోవడం అనేది రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో జరుగదని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము కలిసి కట్టుగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతామని కేసీ చెప్పారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో ఐక్యత ఉందని, పుకార్లను నమ్మవద్దని ఆయన అన్నారు. 2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి గెహ్లాట్-పైలట్ మధ్య అధికార పోరు కొనసాగుతోంది. 2020లో, పైలట్ గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. అప్పటి నుంచి ఇరువురు మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. చూడాలి ఇద్దరు నేతలు కలిసి వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తారనేది.