కోలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ తమిళ్ తో తెలుగులో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.సౌత్ స్టార్ హీరోయిన్ గా జ్యోతికకు మంచి గుర్తింపు వుంది.అయితే జ్యోతిక తన సినీ కెరీర్ ను హిందీ సినిమాతోనే ప్రారంభించింది.కానీ ఆమెకు బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే జ్యోతిక ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ సరసన ‘షైతాన్’ మూవీలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.తాజాగా జ్యోతిక తాను బాలీవుడ్ మూవీస్ లో నటించకపోవడంపై ఆసక్తికర కామెంట్స్ చేసింది..
జ్యోతిక మాట్లాడుతూ.. తాను 27 ఏళ్ల క్రితం సౌత్ సినిమాలలో నటించడం ప్రారంభించినట్లు తెలిపింది.అయితే ఆ తర్వాత సౌత్ లో వరుసగా అవకాశాలు రావడంతో అక్కడి సినిమాలలో నటించినట్లుగా ఆమె తెలిపింది. హిందీలో నా మొదటి సినిమా విజయం సాధించలేదు.మొదటి సినిమా హిట్ అయితే అవకాశాలు రావాలి. నేను హిందీలో చేసిన సినిమాను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా ఆడలేదు. దీనితో తాను సౌత్ సినిమాల వైపు వెళ్లినట్లు జ్యోతిక తెలిపారు. అయితే బాలీవుడ్ పేక్షకులు నన్ను సౌత్ ఇండియా నుంచి వచ్చినట్లు అనుకున్నారని .తనకు హిందీ సినిమాలపై ఇంట్రెస్ట్ లేదని అనుకున్నారని .అందుకే నాకు బాలీవుడ్ లో అవకాశాలు రాలేదని జ్యోతిక తెలిపారు .
