Jyothika About Her Daughter Diya: తెలుగు వాళ్ళు ఎవరికీ హీరోయిన్ జ్యోతిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి ఆమె తమిళ సినిమాలతోనే తెలుగు వారికి దగ్గరైనా సరే, తెలుగులో కూడా మాస్ లాంటి కొన్ని సినిమాలతో ఆమె నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇక హీరో సూర్యను పెళ్లి చేసుకున్న తర్వాత నటనకు చాలా కాలం పాటు దూరంగా ఉన్న ఆమె ఇప్పుడు మళ్లీ నటించడం మొదలుపెట్టింది. ఆ మధ్య ఎక్కువగా లేడి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు తెలుగువాడైన అంధుడు శ్రీకాంత్ బొల్లా బయోపిక్ గా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆమె హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించింది.
Pomegranate Leaves: దానిమ్మ ఆకులను ఇలా తీసుకుంటే చాలు.. ఆ సమస్యలు దూరం..
ఈ క్రమంలో సోషల్ మీడియాలో చాలామంది యాక్టివ్ గా ఉంటున్నారు కానీ మీరు ఎక్కువగా యాక్టివ్గా ఎందుకు ఉండడం లేదు? అని ప్రశ్నిస్తే అది దానికి ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. అదేమిటంటే సోషల్ మీడియా అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం అని, తనకు ఆ విషయం మీద పూర్తిగా అవగాహన లేదని ఆమె చెప్పుకొచ్చింది. తన కుమార్తె దియ ఇప్పుడిప్పుడే తనకు సోషల్ మీడియా గురించి కొన్ని విషయాలు నేర్పిస్తోందని, ఇంస్టాగ్రామ్ గురించి కూడా తన కూతురే తనకు నేర్పించిందని ఆమె పేర్కొన్నారు. తనకు తన రియల్ విషయాలు చెప్పడం అంటే ఇష్టం కాబట్టి తన ట్రావెలింగ్ వీడియోస్, రియల్ అప్డేట్స్ ఆ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడానికి ఇష్టపడుతున్నానని అన్నారు. అంతేకాక నిజానికి ఈ సోషల్ మీడియా మొత్తాన్ని తన కూతురే తనకు నేర్పిస్తోంది అంటూ జ్యోతిక ఈ సందర్భంగా కామెంట్స్ చేసింది.