Site icon NTV Telugu

Killer : ‘కిల్లర్’ టీజర్ అవుట్.. మల్టీ షేడ్స్ జ్యోతి పూర్వజ్ అరాచకం.. !

Killar

Killar

టాలెంటెడ్ నటి జ్యోతి పూర్వజ్, దర్శకుడు పూర్వజ్ జంటగా తెరకెక్కిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ (Killer). ఎ. పద్మనాభ రెడ్డితో కలిసి పూర్వజ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..

టీజర్‌ను పరిశీలిస్తే.. జ్యోతి పూర్వజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, బోల్డ్ పాత్రలో నటించినట్లు స్పష్టమవుతోంది. అంతే కాదు ఈ సినిమాలో జ్యోతి కేవలం ఒకే పాత్రకు పరిమితం కాకుండా.. టెర్రరిస్ట్, స్పై (గూఢచారి), పోలీస్ ఆఫీసర్, లవర్‌గా దాదాపు మూడు, నాలుగు రకాల భిన్నమైన షేడ్స్‌లో కనిపించి అదరగొట్టింది. ప్రతి పాత్రలోనూ ఆమె చూపించిన వేరియేషన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అలా టీజర్‌లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. జ్యోతి తన గ్లామర్‌తోనూ కైపెక్కించింది. బికినీ సీన్స్, రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఆమె నటన యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

Exit mobile version