Justin Trudeau Katy Perry: కెనడా మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వార్తల్లోకి ఎక్కారు. ఆయన కొంతకాలంగా గాయని కేటీ పెర్రీతో డేటింగ్ చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. కానీ ఇప్పుడు అవి పుకార్లు కావని వారి మధ్య సంబంధాన్ని ఒక ఫోటో బాహ్య ప్రపంచానికి పరిచయం చేసింది. వారిద్దరూ ఒక పడవలో ముద్దు పెట్టుకుంటున్నట్లు ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఆ వైరల్ ఫోటోలలో ట్రూడో చొక్కా లేకుండా కేటీ పెర్రీని ముద్దు పెట్టుకుంటున్నట్లు కనిపిస్తోంది.
READ ALSO: Kiran Abbavaram : ఆ హీరోను అవమానించడం కరెక్ట్ కాదు : కిరణ్ అబ్బవరం
జస్టిన్ ట్రూడో తన భార్య సోఫీ నుంచి విడాకులు తీసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కేటీ పెర్రీ కూడా తన భర్త రస్సెల్ బ్రాండ్ నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె ఓర్లాండో బ్లూమ్‌తో సహజీవనం చేసిన తనతో కూడా విడిపోయింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన కేటీ పెర్రీ, ట్రూడోల ఫోటోలు వారి డేటింగ్ పుకార్లను నిర్ధారించాయి. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలో ఒక పడవలో వారిద్దరూ కనిపించినట్లు డైలీ మెయిల్ పేర్కొంది. వాళ్లిద్దరూ విడిపోయారని వార్తలు వచ్చిన కొద్దిసేపటికే ఈ ఫోటో బయటికి రావడం కోసమెరుపు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలలో కేటీ పెర్రీ నల్లటి స్విమ్‌సూట్‌లో కనిపించారు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుంటున్నట్లు, ట్రూడో పెర్రీ చెంపపై ముద్దు పెట్టుకుంటున్నట్లు ఈ ఫోటోలలో కనిపిస్తుంది.
డైలీ మెయిల్ తన కథనంలో.. “వాళ్లు తిమింగలాలను చూసే చిన్న పడవ దగ్గర వారి పడవను ఆపి ముద్దు పెట్టుకోవడం ప్రారంభించారు. ఆ వ్యక్తి చేతిపై ఉన్న పచ్చబొట్టును చూసి, అది జస్టిన్ ట్రూడో అని గ్రహించే వరకు ఆయన ఎవరో నాకు తెలియదు” అని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పినట్లు పేర్కొంది. ఈ ఏడాది జూలైలో మాంట్రియల్‌లో జరిగిన విందు సందర్భంగా ఈ జంట మొదటిసారి కలిసి కనిపించారు. ఆ తర్వాత కెనడాలోని కేటీ పెర్రీ “లైఫ్‌టైమ్స్” టూర్ స్టాప్‌లో ట్రూడో కనిపించారు.
కేటీ పెర్రీ వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఈ ఏడాది జూన్‌లో ఆమె నటుడు, గాయని ఓర్లాండో బ్లూమ్‌తో తన నిశ్చితార్థాన్ని ఏడు సంవత్సరాల తర్వాత విరమించుకుంది. ఇప్పుడు వారిద్దరూ తమ కుమార్తె డైసీ డోవ్‌ను కలిసి పెంచుతున్నారు. 18 ఏళ్ల వివాహం తర్వాత ట్రూడో తన భార్య సోఫీ గ్రెగోయిర్ ట్రూడో నుంచి విడిపోతున్నట్లు ఆగస్టు 2023లో ప్రకటించారు. ట్రూడో – సోఫీలకు ముగ్గురు పిల్లలు.
READ ALSO: Hibatullah Akhundzada: పాక్ – ఆఫ్ఘన్ యుద్ధం.. ఇంతకీ హిబతుల్లా అఖుంద్జాదా ఎవరు?
