కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిటీ విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రాజెక్టును సందర్శించిన కమిటీ.. ఇప్పుడు విచారణను వేగవంతం చేసింది. అయితే.. ఈనేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ మాట్లాడుతూ.. ఈరోజు ఏజెన్సీలతో సమావేశం అయ్యాము. వాళ్లను అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పానని, గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోవాలని అఫిడవిట్ ఫైల్ చేయమన్నాని ఆయన తెలిపారు. టైం బౌండ్ గురించి ఏజెన్సీలు అందరూ చెప్తున్నారు. ప్రభుత్వం విధించిన సమయంలో ప్రాజెక్టు అందించామని అన్నారని, ఎజెన్సీలను నిర్మాణం, డిజైన్, మెంటేనెన్స్ గురించి పూర్తిగా ఇవ్వాలని అదేశించానన్నారు జస్టిస్ చంద్ర ఘోష్.
Prakash Dantuluri: ఎక్కువ చెబితే కిక్ పోతుంది.. కథను ఇబ్బంది పెట్టకూడదు: ఏవమ్ దర్శకుడి ఇంటర్వ్యూ
ఏది చెప్పినా, ఎవరూ కమిషన్ కు చెప్పినా ప్రతిదీ రికార్డు రూపంలో ఉండాలని, ఈ నెలాఖరు లోపు అఫిడవిట్ రూపంలో సమాధానం ఇవ్వాలని అదేశించామని ఆయన తెలిపారు. ఎవరి ఆదేశాల మేరకు పనులు జరిగాయి అనేది రికార్డు రూపంలో సమాధానం వచ్చాక వాళ్లను కూడా పిలుస్తామని, సరైన ఆధారాల కోసమే అఫిడవిట్ దాఖలు చేయమని చెప్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళతో అఫిడవిట్ వచ్చాక ఇతర వ్యక్తులను కూడా పిలుస్తానని, కొంతమంది అధికారులు స్టేట్ లో లేరు. వాళ్లను కూడా విచారణ చేస్తామన్నారు చంద్ర ఘోష్. విజిలెన్స్, కాగ్ రిపోర్టులు అందాయి…వాళ్లను కూడా విచారణ చేస్తామని, తప్పుడు అఫిడవిట్ ఫిల్ చేస్తే మాకు తెలిసిపోతుందన్నారు.
Pakistan : పాకిస్థాన్‌కు గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన గాడిదల జనాభా
