అంతరిక్షం గురించి ఏ విషయమైనా ఆసక్తి కలిగిస్తుంది. అయితే.. సోలార్ సిస్టమ్‌లో అతిపెద్ద గ్రహం జూపిటర్. భూమితో పోలిస్తే జూపిటర్ అయస్కాంత క్షేత్రం 14 రెట్లు బలంగా ఉంటుంది. గురుగ్రహంపై గ్రేట్ రెడ్ స్పాట్ తుఫాన్ భూమి కన్నా పెద్దగా ఉంటుంది. సౌర్య వ్యవస్థలో అత్యంత వేగంగా తిరిగే గ్రహం గురుగ్రహం. అక్కడి ఒక రోజు వ్యవధి 9 గంటల 55 నిమిషాలు. జూపిటర్ సోలార్ సిస్టమ్ వ్యాక్యూమ్ క్లీనర్‌గా పిలుస్తారు. ఇది తన గురుత్వాకర్షణ శక్తితో ఆస్ట్రాయిరాడ్స్ ఆకర్షిస్తుంది. భూమితో పోలిస్తే గురుగ్రహం 318 రెట్లు పెద్దది.
ఇప్పటివరకు 9 స్పేస్ క్రాఫ్ట్ గురుడి దగ్గరకు వెళ్లాయి. జూనో స్పేస్ క్రాఫ్ట్ గురుడికి సంబంధించి అనేక విషయాలను బయటపెట్టింది. అయితే.. ఇప్పుడు ఈ భూమికి బృహస్పతి దగ్గరగా రానున్నట్లు నాసా వెల్లడించింది. అయితే.. ఈ నెల 26న అంటే మరో వారం రోజుల తరువాత గురు గ్రహం భూమికి మరింత దగ్గర రానున్నట్లు తెలిపింది. అయితే.. బైనాకూలర్స్‌తో వింతను ప్రజలు వీక్షించి ఆనందించవచ్చని పేర్కొంది.
