Site icon NTV Telugu

Jupally Krishna Rao : దళితులకు మూడెకరాలు ఇస్తామన్నారు‌… ఎంత మందికిచ్చారు

Jupally

Jupally

వనపర్తిలో నిర్వహించిన ఆత్మగౌరవ సభలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆత్మీయ సభకు వస్తున్న వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో ఆపి అడ్డుకొంటున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా..’ మంత్రి కి భయం మొదలైంది. 2014 ఎన్నికలకు ముందు డబుల్ బెడ్ రూములిస్తామన్నారు. ఆరు లక్షల ఇల్లు మూడు లక్షల కు తగ్గించారు. డబుల్ బెడ్ రూం లు ఎందుకు కట్టించలేక పోయారు. ఇది మూస పద్దతి కాదా. దళితుల కు మూడెకరాలు ఇస్తామన్నారు‌. నిరంజన్ రెడ్డి ఎంత మందికిచ్చారు. రైతులకు రుణమాఫి అన్నా రు. 24వందలు కావాలి. నాలుగు వందల కోట్లు మాత్రమే ఇచ్చారు. ఎన్నికల లోపు ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వక పోతే గ్రామాల్లోకి అడుగు పెట్టనివ్వొద్దు.

Also Read : Bandi Sanjay : హిందుత్వం లేకుండా భారతదేశం లేదు

టీడీపీ నుంచి తన్ని తరిమితే .. టీఆర్ఎస్ లో చేరావు. అందరు అడ్వకేట్లు కేసు గెలవడానికి ఫీజు తీసుకుంటే… నిరంజన్ రెడ్డి ఓడిపోయిన దానికి ఫీజు‌తీసుకున్నారు. అందుకే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకోలేదు. నేను ఉద్యమకారుడ్ని.. నీవు ఏ ఉద్యమం చేశావు. చిన్నారెడ్డి, తాను కృషి చేస్తేనే వనపర్తి కి నీళ్లు వచ్చాయి. కానీ నీవు నీళ్ల నిరంజన్ రెడ్డి వి. కెఎల్ఐ కింద నిరంజన్ రెడ్డి రిజర్వాయర్లు ఎందుకు కట్టించలేదు. 2005 వరకు ఏమీ లేని నిరంజన్ రెడ్డి ఇప్పుడు వందల కోట్లకు ఎలా ఎదిగినవ్.‌ ఎక్కడి నుంచి వచ్చాయి. ఎంపీ ఎన్నికల్లో, ఎంల్సీ ఎన్నికల్లో సపోర్టు చేయమని అడిగితే చేశాను. నిరంజన్ రెడ్డికి ఈ సారి ఓట్లు అడిగే అర్హత లేదు‌. ఆట ఇప్పుడే మొదలైంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా తీసుకుంటాం. కర్నాటక లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలి వీసిందో..అలాగే తెలంగాణ లో బిఆర్ఎస్ ఊడ్చుకుపోతుంది.’ అని ఆయన అన్నారు.

Also Read : Karnataka: లోపల కాంగ్రెస్ మీటింగ్.. బయట ఫైటింగ్.. బెంగళూర్‌లో టెన్షన్

Exit mobile version