NTV Telugu Site icon

Jupally Krishna Rao : మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుంది

Jupally

Jupally

సింగపూర్ లో..దుబాయ్ లో ఏముండే.. ఇసుక తిన్నెలు తప్పా.. ఇంకేం ఉన్నాయని, ఇప్పుడు ఎలా మారిపోయాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రోడ్లు వెడల్పులో జూబ్లీహిల్స్.. బంజారాహిల్స్ లో పెద్ద పెద్ద ఇండ్లు కూల్చారని, మూసీలో లక్ష 50 వేల కోట్లు పెట్టినట్టు మాట్లాడుతున్నారని, .కేసీఆర్..కేటీఆర్..హరీష్ లు గొప్ప నీతిమంతుల లెక్క మాట్లాడుతున్నారన్నారు మంత్రి జూపల్లి. వీళ్ళ ఎంత గొప్పవాళ్ళు అంటే.. హరీష్.. ఒకప్పుడు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లావో తెలియదా..? అని ఆయన అన్నారు. రాజకీయ బాధ తప్పితే కేటీఆర్‌కి ఇంకో బాధ లేదని, గతంలో హరీష్‌రావు మంత్రి అయ్యిందే కాంగ్రెస్‌ భిక్షతోని MLA కాకుండా మంత్రి అయ్యావు.. అదేనా నీ జ్ఞానం అని ఆయన అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతం వసూలు డబుల్ బెడ్ రూం కి వెళ్లొద్దా అని ఆయన అన్నారు. మూసీ రివర్ ఫ్రెండ్ అభివృద్ధిలో నా ఇల్లు కూడా పోతుందని ఆయన అన్నారు.

Amaravati Drone Summit 2024: డ్రోన్ స‌మ్మిట్‌కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు

అంతేకాకుండా..’ఆ రోజు ఎమ్మెల్యే కాకుండా మంత్రి పదవి వద్దు అని అనేంత జ్ఞానం ఎక్కడ పోయింది హరీష్.. హుస్సేన్ సాగర్ నీ కొబ్బరినీళ్లు చేస్తానని కేసీఆర్ చేశాడా..? 8 లక్షల కోట్లు అప్పు చేసినా.. ఎందుకు కొబ్బరినీళ్లు కాలేదు. మీ పదేళ్ల పాలన పై Lb స్టేడియం లో చర్చ పెడదాం రా హరీష్.. అప్పులు ఎంత.. పదేళ్లలో అవినీతి ఎంత.. . ఎవరి దోపిడీ ఎంత. మీ ఆస్తులు ఎంత అనేది చర్చ పెడదాం రా. ఢిల్లీకి కప్పం గురించి కేటీఆర్ మాట్లాడుతున్నాడు.. ఢిల్లీకి డబ్బులు పంపింది మీరు కాదా.. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు డబ్బులు పంపింది మీరు కదా..?’ అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Naga Chaitanya: లిఫ్టులో చైతూ-శోభిత.. అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారో!

Show comments