Jupally Krishna Rao : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణ రావ్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, జిల్లా గ్రంథాలయ ఛైర్మెన్ మధుసూదన్ రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణా రావు మాట్లాడుతూ నేటి సమాజంలో, ప్రస్తుత పరిస్థితుల్లో సంస్కారం నేర్పేది విద్య మాత్రమే అన్నారు. గ్రంథాలయాల్లో మహనీయుల పుస్తకాలు ఉండాలన్నారు. అభివృద్ధి కి నిధులు కేటాయించినప్పుడు అందులో నుండి 10% గ్రంథాలయాలకు ఉపయోగించాలన్నారు. ప్రతి గ్రామములో గ్రంధాలయాలు ఏర్పాటు దిశగా పని చేయాలన్నారు.
Beggar Buys iPhone: రూ. 1.7 లక్షల విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేసిన బిచ్చగాడు!
యువత చెడు అలవాట్లకు, మొబైల్స్ లో సమయం వృధా చేయడం మానేసి గ్రంధాలయాల్లో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. కోట్ల ఖర్చుతో విగ్రహాల ఏర్పాట్ల పై శ్రద్ద కన్నా విద్య పై, గ్రంథాలయాలపై శ్రద్ధ పెట్టాలన్నారు. సాంస్కృతిక శాఖ తరపున గ్రంథాలయానికి 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు అయన ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గ్రంథాలయంలో విద్యార్థులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను ఏర్పాటు చేయాలన్నారు. పుస్తకాలు కొనుక్కోవడం వీలు కానీ పేద విద్యార్థులకు గ్రంథాలయాలు ఆసరాగా ఉండాలన్నారు. వర్తమాన అంశాలపై గ్రంథాలయంలో విద్యార్థులకు లెక్చర్లు ఏర్పటు చేయాలన్నారు.