Juniper Hotels IPO: లగ్జరీ హోటల్స్ డెవలప్‌మెంట్ కంపెనీ జూనిపర్ హోటల్స్ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీవోను ప్రారంభించేందుకు కంపెనీ స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డ్రాఫ్ట్ పేపర్ (డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్)ను దాఖలు చేసింది. జునిపర్ హోటల్స్ సరాఫ్ హోటల్స్, జునిపర్ ఇన్వెస్ట్‌మెంట్స్, హయత్ హోటల్స్ కార్పొరేషన్ యాజమాన్యంలో ఉంది.
Read Also:Room Rent: ఏంటి ఒక్క రాత్రికి రూ.14లక్షలా.. అంతలా ఏముందో..!
జునిపర్ హోటల్స్ రూ.10 ముఖ విలువతో తాజా ఈక్విటీని జారీ చేస్తుంది. ఐపీవో ద్వారా రూ.1800 కోట్లు సమీకరించబడతాయి. ఈ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండదు. అంటే ప్రమోటర్లు లేదా పెట్టుబడిదారులు తమ వాటాను విక్రయించరు. ఐపీవోలో సంస్థాగత పెట్టుబడిదారులకు 75 శాతం, రిటైల్ పెట్టుబడిదారులకు 15 శాతం ఈక్విటీ జారీ చేయబడుతుంది. డ్రాఫ్ట్ పేపర్ ప్రకారం, ఐపీవో ద్వారా సేకరించిన మొత్తంలో కంపెనీ 1500 కోట్ల రూపాయలతో రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.
Read Also:Wife Birthday: భర్తలు అలర్ట్.. భార్యల బర్త్ డే మర్చిపోతే జైలుకే..!
జునిపెర్ హోటల్స్ వ్యవస్థాపకులు, చైర్మన్ ఎండీ అరుణ్ కుమార్ సరాఫ్, వరుణ్ సరాఫ్ హోటల్ సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆయన హోటళ్ల అభివృద్ధి, ఆస్తి నిర్వహణకు బాధ్యత వహిస్తుంటారు. భారతదేశంలో హయత్ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టిన ఏకైక హోటల్ డెవలప్‌మెంట్ కంపెనీ జునిపర్ హోటల్స్. సరాఫ్ గ్రూప్, హయత్ నాలుగు దశాబ్దాల భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. 1982లో రాజధాని న్యూఢిల్లీలో తొలి హయత్ హోటల్ ప్రారంభమైంది. కంపెనీ భారతదేశం,నేపాల్‌లో 12 హోటళ్లను అభివృద్ధి చేసింది. వీటిపై జునిపెర్ యాజమాన్య హక్కులు ఉన్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.827.8 కోట్లు కాగా, 2021-22లో రూ.188 కోట్లతో పోలిస్తే కంపెనీ నష్టం రూ.1.2 కోట్లకు తగ్గింది. జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, సీఎల్ఎస్ఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఐపీవో బుక్ రన్నింగ్ లీడర్ మేనేజర్లుగా ఉన్నాయి.