Site icon NTV Telugu

BIG BREAKING : అమిత్‌ షాతో ఎన్టీఆర్‌ భేటీ..

Amit Shah Ntr

Amit Shah Ntr

తెలంగాణలో అమిత్ షా టూర్‌పై సర్పైజ్ అప్డేట్ అందింది. ఈ రోజు తెలంగాణకు వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ను కలువనున్నారు జూనియర్‌ఎన్టీఆర్‌. అమిత్‌ షాతో డిన్నర్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ ను ఆహ్వానించారు తెలంగాణ బీజేపీ నేతలు. అమిత్‌ షా ఆహ్వానం మేరకు తారక్ 15 నిమిషాల డిన్నర్‌ భేటీలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ‘RRR’లో కొమురం భీం పాత్రలో ఒదిగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫిదా అయినట్లు షా ఇటీవల చెప్పారు. కాగా.. తారక్ రాజకీయాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్న తరుణంలో ఈ భేటీ ఎటు దారితీస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. మునుగోడులో నేడు బీజేపీ సమరభేరి పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ భారీ బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొనేందుకే కాకుండా.. ఇటీవల ఉత్తమ రైతు అవార్డులు సాధించిన రైతులతో కూడా అమిత్‌ షా భేటీ కానున్నారు. అమిత్‌ షా షెడ్యూల్‌లో మరి కొంత మందితో కూడా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

 

Exit mobile version