ప్రభుత్వ ఉద్యోగులు, జడ్జిలు, కలెక్టర్లు అంటే ఖరీదైన వైద్యం అందుకుంటారని అపవాదు నిన్నమొన్నటివరకూ ఉంది. కానీ తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వాసుపత్రుల తీరు మారిపోయింది. కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నేలా ప్రభుత్వ దవాఖానాలు అన్ని సౌకర్యాలతో రోగులకు సకల సదుపాయాలు అందిస్తున్నాయి. అందుకే బ్యూరోక్రాట్లు, న్యాయవ్యవస్థ, పోలీసు శాఖలకు చెందినవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరి ప్రసవాలకు కూడా సిద్ధం అవుతున్నారు. తాజాగా ఓ జూనియర్ సివిల్ జడ్జి ఒకరు అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Read Also: Google Search: ఏషియన్ టాప్-5లో ముగ్గురు భారతీయులు
హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి శాలిని పండంటి ఆడబిడ్డకు జన్మ నిచ్చారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీప్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ లు జడ్జి షాలినినీ కలిశారు. ఆమెను, బిడ్డను చూసి, ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సర్కారు దవాఖానాలను సీఎం కేసీఆర్ బలోపేతం చేసి పేద, మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తుందన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రిల్లో నాణ్యమైన వైద్యం అందుతుందనడానికి ఇదే నిదర్శనం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సిజేరియన్లు చేయకుండా.. నార్మల్ డెలివరీలు చేయడానికి వైద్యులు కృషి చేయాలని మంత్రి వైద్యులను ఆదేశించారు. నార్మల్ డెలివరీ చేసే వైద్యులకు, వైద్య సిబ్బందికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది ప్రభుత్వం. సంపన్నులు కూడా ప్రభుత్వ వైద్యాన్ని పొందుతున్నారని అధికారులు అంటున్నారు.
గతంలోనూ తెలంగాణలో ఉన్నతాధికారుల భార్యలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. మూడునెలల క్రితం ఓ ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ భార్య ప్రసవించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య, ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నార్మల్ డెలివరీకి ప్రయత్నించినా.. కుదరకపోవడంతో సిజేరియన్ చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారని పలువురు ప్రశంసించారు. తాజాగా జూనియర్ సివిల్ జడ్జి శాలిని మరింతమందికి ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దేనికీ తీసిపోవని ఆమె నిరూపించారని పలువురు అభినందిస్తున్నారు.
Read Also: Sundeep Kishan : రెజీనాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సందీప్ కిషన్
