Shocking Incident: కొంత మంది రౌడీలు, గుండాలు జడ్జిలను బెదిరించడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఒకడు నిజంగానే రియల్ లైఫ్‌లో డబ్బుల కోసం ఏకంగా జడ్జినే బెదిరించాడు. విషయం బయటికి రాగానే నెటిజన్లు.. వీడు మామూలోడు కాదు భయ్యా.. అని కామెంట్స్ పెడుతున్నారు. ఈ రౌడీ చాలా తెలివిగా ఓ స్పీడ్ పోస్ట్‌లో జడ్జిని బెదిరిస్తూ లెటర్ పంపి డబ్బులు డిమాండ్ చేశాడు. వీడి ధైర్యం ఏంటి, ఈ సంఘటన ఎప్పుడు వెలుగు చూసిందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Coolie OTT Release:ఓటీటీలోకి రజనీకాంత్ ‘కూలి’.. ఎప్పుడంటే??
జడ్జిని రూ.5 బిలియన్లు డిమాండ్ చేశాడు..
మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా త్యోతర్ కోర్టులో మోహిని భడోరియా అనే మహిళ మొదటి సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. ఈసందర్భంగా ఆమెకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి స్పీడ్ పోస్ట్ ద్వారా ఒక లెటర్ వచ్చింది. ముందుగా ఆమె దానిని చాలా సాధారణమైన లెటర్ అనుకుంది. కానీ దానిని ఓపెన్ చేసి చూస్తే అందులో ఆమెను బెదిరిస్తూ, ప్రాణాలతో ఉండాలంటే రూ.5 బిలియన్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమెను ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డారో ఆయన తనను బందిపోటు నాయకుడు హనుమంతుడి ముఠా సభ్యుడిగా పేర్కొన్నాడు. ఫస్ట్ ఈ లెటర్ చదివిన తర్వాత జడ్జి మోహిని భయడ్డారు. ఈ లెటర్‌లో ఆమె ఆ మొత్తం డబ్బులను సెప్టెంబర్ 1వ తేదీ రాత్రి 7:45 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని బద్గడ్ అడవికి పంపించాలని డిమాండ్ చేశాడు. ఒక వేళ పంపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన జడ్జి..
బెదిరింపుతో ఆశ్చర్యపోయిన జడ్జి భడోరియా వెంటనే లెటర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు సూపరింటెండెంట్ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. న్యాయమూర్తికి బెదిరింపునకు పాల్పడటంతో పాటు, రూ.5 బిలియన్ల చెల్లించాలని డిమాండ్ చేస్తూ వచ్చిన రిజిస్టర్డ్ పోస్ట్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో భాగంగా ఉత్తరప్రదేశ్‌కు కూడా ఒక బృందాన్ని పంపించామని చెప్పారు. ఇప్పటికే కేసులో ఒక నిందితుడిని గుర్తించినట్లు చెప్పారు.
READ ALSO: UP Man Wins Lottery: 30 ఏళ్ల యువకుడికి రూ.34 కోట్ల బహుమానం.. దుబాయ్‌లో యూపీ యువకుడి అదృష్టం..
