Telangana High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సీఐగా పనిచేస్తున్న సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగినట్లు ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేశారు. తన భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో పరిచయం పెంచుకుని, న్యాయం చేస్తానని నమ్మించి వివాహేతర సంబంధం కొనసాగించినట్లు విచారణలో తేలింది. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బాధితురాలిని లొంగదీసుకోవడం, బెదిరింపులకు పాల్పడటం, డబ్బులు వసూలు చేయడమే కాకుండా కొంతకాలం ఆమెతో ఒకే ఇంట్లో కలిసి నివసించినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బాధితురాలి ఫిర్యాదుతో సైబరాబాద్ పరిధిలోని అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదైంది. ఈ తీవ్రమైన ఆరోపణలు అంతర్గత విచారణలో రుజువు కావడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇటీవల శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో ఆయనపై చట్టపరమైన చర్యలు మరింత వేగవంతం కానున్నాయి.
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Jubilee Hills
