Site icon NTV Telugu

Flying Squad Raid: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ కలకలం.. బీఆర్‌ఎస్ నేతల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు..!

Raid

Raid

Flying Squad Raid: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలు తమ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఓ వైపు ముఖ్యమంత్రి, మంత్రులు.. మరోవైపు విపక్షంలోని బీఆర్‌ఎస్, బీజేపీ ముఖ్య నేతలు నియోజకవర్గ పరిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచార పర్వం నేపథ్యంలో ఓటర్లను తాయిలాలతో మభ్యపెట్టేందుకు ప్రధాన పార్టీలు సన్నద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల సంఘం అప్రమత్తమై కీలక నేతల కదలికలపై నిరంతరం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఓటర్లకు డబ్బు పంచేందుకు భారీ ఎత్తున నిల్వ చేశారనే సమాచారం మేరకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్థానిక పోలీసులతో కలిసి బీఆర్‌ఎస్‌ కీలక నేతల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

Shree Charani: సీఎం చంద్రబాబుని కలిసిన క్రికెటర్ శ్రీ చరణి!

ఇవాళ ఉదయం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మోతీనగర్‌లోని ఆయన ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంట్లో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా గాలిస్తున్నారు. అదేవిధంగా కూకట్‌పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రవీందర్‌రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రవీందర్‌రావు తన ఇంట్లో సోదాలు జరుగుతున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో లేని ప్రాంతంలోకి పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఎలా వస్తారని ఆయన మండిపడ్డారు.

Koti Deepotsavam 2025 Day 7: అమ్మవార్లకు కోటి కుంకుమార్చన.. జగన్మాతలకు ఒడిబియ్యం సమర్పణ..!

Exit mobile version