Site icon NTV Telugu

Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు..

Congress

Congress

Jubilee Hills Election Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. 101 పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది.. అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కాగా.. ఇందులోనూ హస్తం పార్టీ మెజారిటీ కనబరిచింది. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది.. 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్‌కు 8,926 ఓట్లు, బీఆర్‌ఎస్‌ 8,864 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్ పార్టీ 9,691 ఓట్లు సాధించి 1144 ఓట్ల ముందంజలో నిలిచింది. ఇదే రౌండ్‌లో బీర్ఎస్‌కు 8,609 ఓట్లు వచ్చాయి. ఇంకా ఎనిమిది రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ ఎన్నికలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. మరోవైపు.. బీఆర్ఎస్ సైతం తమ పార్టీ అభ్యర్థి గెలుస్తారని చెబుతోంది. కాగా.. బీజేపీ మాత్రం వెనకంజలో కొనసాగుతోంది.

READ MORE: IND vs SA 1st Test: మూడో స్థానంలో ఊహించని బ్యాటర్.. తొలి టెస్టులో ఆడే భారత జట్టు ఇదే!

Exit mobile version