Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు రికార్డు స్థాయిలో సాగింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు సమర్పించారు. దీంతో తెల్లవారు జామున మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు, అనుచరులు రిటర్నింగ్ ఆఫీసు వద్ద గుమిగూడారు. అధికారులు రాత్రంతా నామినేషన్ల స్వీకరణలో నిమగ్నమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నారు. ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో తుది పోటీదారుల జాబితా వచ్చే రెండు రోజుల్లో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.
READ MORE: Sharwanand : వరుస సినిమాలు చేస్తున్న శర్వా.. హిట్ కొట్టేది ఎప్పుడు?
