Site icon NTV Telugu

KTR: ఆ మూడు రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు..! జూబ్లీహిల్స్ ఓటమిపై కేటీఆర్ రియాక్షన్..

Ktr

Ktr

KTR Reacts to Congress Victory in Jubilee Hills Byelection; జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు మించి మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏకంగా 24 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ అంశంపై తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎన్నికల్లో జయ అయాపజయాలు కామన్ అని మా నాయకులు కేసీఆర్ ఎప్పుడూ చెబుతారన్నారు. ఫలితం తమకు కొంత నిరుత్సాహ పరిచిందని.. అయినా తాము కృంగి పోవడం లేదని స్పష్టం చేశారు. సహకారం అందించిన అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. 407 బూత్‌లలో తమ లోకల్ నాయకులు చాలా కష్టపడ్డారని చెప్పారు. తమ అభ్యర్థి కొత్త అభ్యర్థి చాలా కోట్లాడారన్నారు. తమకు ఓటు వేసిన ఓటర్లకి ధన్యవాదాలు తెలిపారు.

READ MORE: Rahul Gandhi: పని చేయని రాహుల్‌గాంధీ ‘ఓట్ చోర్’ పాచిక

“ప్రతి సర్వే బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పింది.. కానీ చివరి మూడు రోజులు ఏమి జరిగిందో అందరికీ తెలుసు.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమే అని అర్థం అయింది. మేము అధికారంలో ఉన్నప్పుడు 7 ఉప ఎన్నికలు జరిగితే మేము ఐదు చోట్ల గెలిచాం.. కాంగ్రెస్ ఒకటి కూడా గెలవలేదు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు సీట్లు మాత్రమే గెలిచింది.. అయినా 2023లో అధికారం లోకి వచ్చింది.. ఇది కామన్.” అని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

READ MORE: OnePlus 15 Review: వన్‌ప్లస్‌ 15 రివ్యూ.. డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ పర్ఫామెన్స్ ఎలా ఉన్నాయంటే?

 

Exit mobile version