Jubilee Hills by-poll: రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో గల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 13 (సోమవారం)న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదలైంది. నామినేషన్లను స్వీకరించడానికి చివరి తేదీ అక్టోబర్ 21 (మంగళవారం)గా నిర్ణయించింది ఈసీ. అలాగే నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 (బుధవారం)న జరుగుతుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 24 (శుక్రవారం)గా నిర్ణయించారు. ఇక పోలింగ్ నవంబర్ 11న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరిగి, ఎన్నికల ప్రక్రియను నవంబర్ 16 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.
Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై కీలక పరిణామం.. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు
అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్‌పేట్ తాసీల్ధార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నామినేషన్లను ఫారం-2బిలో దాఖలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తప్పనిసరిగా ఫారం-26లో అఫిడవిట్‌ను సమర్పించాలి. అన్ని పత్రాలపై అభ్యర్థి సంతకం, నోటరీ సంతకం, నోటరీ సీల్‌తో నోటరైజ్ చేయాలి. అక్టోబర్ 19 (ఆదివారం), అక్టోబర్ 20 (దీపావళి) తేదీల్లో పబ్లిక్ సెలవులు కారణంగా నామినేషన్లను స్వీకరించబడవు. ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు నియోజకవర్గానికి చెందిన ఒక్క ఓటరు ప్రపోజర్‌గా ఉండాలి. ఇతర అభ్యర్థులకు మాత్రం నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రపోజర్లుగా ఉండాలి. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీకి రూ.10,000, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి కుల ధృవీకరణ పత్రంతో పాటు రూ.5,000 నగదు చెల్లించాలి.
Gold Price Today: బంగారంపై ఈరోజు కూడా భారీగా బాదుడే.. వెండిపై ఏకంగా 5 వేలు!
