Site icon NTV Telugu

MG Windsor EV: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే చాలు 449 కి.మీ రేంజ్‌ వచ్చే ఎంజీ విండ్సర్ EV లాంచ్.. ధరలు, ఫీచర్లు వివరాలు ఇలా..!

Mg Windsor Ev

Mg Windsor Ev

MG Windsor EV: JSW MG మోటార్ ఇండియా తమ విండ్సర్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) కు కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఎక్స్‌క్లూజివ్ ప్రో (Exclusive Pro) పేరిట ఈ వేరియంట్‌ను లాంచ్ చేశారు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 17.24 లక్షలుగా నిర్ణయించారు. అయితే, బ్యాటరీ-ఎజ్-అ-సర్వీస్ (BaaS) ఆప్షన్ తీసుకుంటే, ధరను రూ. 12.24 లక్షల (ఎక్స్‌షోరూమ్)కు తగ్గించవచ్చు. BaaS స్కీమ్‌లో కిలోమీటరుకు రూ. 4.5 చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త వేరియంట్‌ను రూ. 11,000 టోకెన్ అమౌంట్‌తో దేశవ్యాప్తంగా ఎంపీజీ డీలర్‌షిప్‌ల వద్ద బుక్ చేసుకోవచ్చు. ఈ డెలివరీలు జూన్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Read Also: Virat Anushka: పికిల్‌బాల్ భాగస్వాములుగా మారిన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట..!

ఇక ఈ ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్‌లో 52.9 kWh లిథియం అయాన్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఒక్క ఛార్జ్‌తో గరిష్టంగా 449 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఇది 38 kWh బ్యాటరీ వేరియంట్లతో పోలిస్తే చాలా బెటర్. ఇంతకు ముందు ఈ పెద్ద బ్యాటరీ వేరియంట్‌ను కేవలం ఎసెన్స్ ప్రో వేరియంట్‌లో మాత్రమే అందించారు. ఎక్స్‌క్లూజివ్ ప్రో వేరియంట్‌లో డ్యుయల్-టోన్ ఐవరీ అండ్ బ్లాక్ ఇంటీరియర్‌లు ఉంటాయి. 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫొటైన్‌మెంట్ సిస్టమ్, స్పీకర్ సౌండ్ సిస్టమ్, AI ఆధారిత వాయిస్ కమాండ్లు, గ్లాస్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, అంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రికల్ డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఉన్నాయి. ఇది 18-ఇంచ్ డ్యుయల్-టోన్ అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది. కలర్ ఆప్షన్లలో పర్ల్ వైట్, స్టారీ బ్లాక్, టర్కాయిస్ గ్రీన్ లభ్యం అవుతాయి.

Read Also: Supreme Court: ప్రొఫెసర్ అలీ ఖాన్ మహ్మదాబాద్‌కు ఊరట.. బెయిల్ మంజూర్

విండ్సర్ EV వేరియంట్‌ల ధరలను పరిశీలిస్తే, ఎంట్రీ లెవెల్ వేరియంట్ అయిన ఎక్సైట్ (38kWh) మోడల్ BaaS ఆప్షన్‌తో రూ. 9.99 లక్షలు + కిలోమీటరుకు రూ. 3.9గా ఉండగా, దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 13,99,800గా ఉంది. తర్వాతి వేరియంట్ ఎక్స్‌క్లూజివ్ (38kWh) ధర BaaS ప్లాన్‌తో రూ. 10.99 లక్షలు + రూ. 3.9/కి.మీగా ఉండి, ఎక్స్‌షోరూమ్ ధర రూ. 15,04,800గా ఉంది. అదే విధంగా, ఎసెన్స్ (38kWh) వేరియంట్‌కి BaaS ధర రూ. 11.99 లక్షలు + రూ.3.9/కి.మీ కాగా, ఎక్స్‌షోరూమ్ ధర రూ. 16,14,800గా ఉంది. ఇక పెద్ద బ్యాటరీ సామర్థ్యం కలిగిన వేరియంట్‌లకు వస్తే, ఎక్స్‌క్లూజివ్ ప్రో (52.9kWh) మోడల్‌కి BaaS ప్లాన్ ప్రకారం రూ. 12.24 లక్షలు + రూ.4.5/కి.మీగా ఉండగా, ఎక్స్‌షోరూమ్ ధర రూ. 17,24,800గా ఉంది. చివరిగా టాప్ వేరియంట్ అయిన ఎసెన్స్ ప్రో (52.9kWh) BaaS ధర రూ. 13.09 లక్షలు + రూ. 4.5/కి.మీగా ఉండి, ఎక్స్‌షోరూమ్ ధర రూ. 18,09,800గా నిర్ణయించారు.

Exit mobile version