Jr NTR: అభిమాని అనుమానాస్పద మృతి.. తక్షణమే దర్యాప్తు జరపాలని లేఖ విడుదల చేసిన ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR Releases a letter on his fan shyam’s death: జూనియర్ ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్, ఏపీకి చెందిన శ్యామ్ అనే కుర్రాడు అనుమానస్పదంగా మృతిచెందడం తీవ్ర సంచలనంగా మారింది. తన అమ్మమ్మ ఊరు అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మోడేకుర్రుకు వారం రోజుల క్రితం వచ్చిన శ్యామ్ జూన్ 25న శనివారం అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. చేతి మణికట్టుపై బ్లేడ్‌తో పలుసార్లు కోసుకుని, అక్కడే ఉరివేసుకున్న స్థితిలో శ్యామ్ మృతదేహం కనిపించింది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద కేసుగా నమోదుచేసి మృతదేహానికి పోస్ట్‌మార్టం కూడా నిర్వహించారు. అయితే ఎన్టీఆర్ అభిమానిగా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానుల్లో మంచి గుర్తింపు ఉన్న శ్యామ్ అనుమానాస్పదంగా చనిపోవడంతో సోషల్ మీడియాలో ఒక్క సారిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ శ్యామ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయం మీద నారా లోకేష్, చంద్రబాబు వంటి వారు ప్రభుతం నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ విషయంలో స్పందించారు.
Etala Jamuna: ఈటల జమున సంచలన ఆరోపణ.. రాజేందర్ ను చంపేందుకు కుట్ర..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈ మేరకు అయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ‘’శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన, శ్యామ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలచి వేస్తుంది, ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై తక్షణమే దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. అనుమానస్పద రీతిలో మృతిచెందిన శ్యామ్ స్వస్థలం గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట అయినా కుటుంబం చాలా కాలం నుంచి తిరుపతిలో ఉంటున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసిన శ్యామ్ కాకినాడలో జాబ్ చూసుకుంటానని కొత్తపేట మండలంలోని మోడేకుర్రులోని తన అమ్మమ్మ ఇంటిలో వారం రోజులుగా ఉంటున్నాడు. అయితే శనివారం చేతి మణికట్టు వద్ద పలుసార్లు బ్లేడుతో కోసుకుని, అదే బ్లేడును తన జేబులో పెట్టుకుని ఉరి వేసుకుని మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. ఇతర హీరోల అభిమానులే అతని చావుకు కారణమని ఒక వాదన, లవ్ ఫైల్యూర్ అని ఒక వాదన అయితే తెర మీదకు వస్తూనే ఉంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..