Site icon NTV Telugu

Dhurandhar The Revenge : ధురందర్ 2 పై టాలీవుడ్ స్టార్స్ ప్రశంసల జల్లు

Tollywood

Tollywood

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌పై తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అగ్ర హీరోలు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మన సొంత సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో టాలీవుడ్ స్టార్స్ మౌనం వహించడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ధురంధర్ పై హీరోల రియాక్షన్స్:

 యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై స్పందిస్తూ.. “భారతీయ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాను అందించిన ధురంధర్: ది రివెంజ్ టీమ్‌కు నా బిగ్ సెల్యూట్”. సినిమాలోని మేకింగ్ వ్యాల్యూస్ మరియు ఎమోషన్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. రణవీర్ సింగ్ అద్భుతమైన పర్ఫామెన్స్ చేసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన శైలిలో సినిమాను ప్రశంసించారు. “ధురంధర్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్. రణవీర్ సింగ్‌లో ఇప్పటి వరకు చూడని ఒక అద్భుతమైన వెర్షన్‌ను దర్శకుడు ఆదిత్య ధర్ వెలికితీశారు. ఈ సినిమాకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిందే”

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలోని దేశభక్తి అంశాలను హైలైట్ చేశారు. “నేను ఇప్పుడే ధురంధర్ చూశాను. దేశభక్తిని చాలా స్వాగ్‌తో చూపించారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ సినిమా ఉంది. థియేటర్లో విజిల్స్ వేయించే చాలా సన్నివేశాలు ఉన్నాయి

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకు వేసి.. “రేపటి నుంచి భారతీయ సినిమా మరియు సంస్కృతిలో ఏదో పెద్ద మార్పు జరగబోతోంది. దీనిని కేవలం నాలుగు పదాల్లో చెప్పాలంటే.. భారత్ మాతాకీ జై!”

మొత్తానికి టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒక్కసారిగా ఒక బాలీవుడ్ సినిమాను ఈ స్థాయిలో సపోర్ట్ చేయడం చూస్తుంటే, ‘ధురంధర్’ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

Exit mobile version